బ్రహ్మరాక్షసుడిలా...
ABN , Publish Date - Jul 17 , 2024 | 06:30 AM
తమిళ కథానాయకుడు ఽధనుష్ 50వ చిత్రం ‘రాయన్’. ఈ సినిమాకు ఆయనే దర్శకుడు కూడా. సందీప్‌కిషన్, కాళిదాస్ జయరామ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు....
తమిళ కథానాయకుడు ఽధనుష్ 50వ చిత్రం ‘రాయన్’. ఈ సినిమాకు ఆయనే దర్శకుడు కూడా. సందీప్‌కిషన్, కాళిదాస్ జయరామ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు. ‘బ్రహ్మరాక్షసుడిలా వస్తాడు.. దహనం చేస్తాడు’ అంటూ ధనుష్ పాత్రను పరిచయం చేశారు. యాక్షన్ ప్యాక్డ్ ఎలిమెంట్స్‌తో ట్రైలర్ అదిరిపోయింది. ఇందులో నటించిన సందీప్‌కిషన్, ప్రకాశ్‌రాజ్, ఎస్.జె.సూర్య, కాళిదాస్ జయరామ్ ముఖ్య పాత్రలో కనిపించారు. ఆస్కార్ విన్నర్ ఏ.ఆర్.రెహమాన్ నేపథ్యం సంగీతం అలరించింది. పీటర్ హెయిన్ యాక్షన్ కొరియోగ్రఫీ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఈ నెల 26న ‘రాయన్’ చిత్రం విడుదల కానుంది. తెలుగు వెర్షన్‌ను ఏషియన్ సురేశ్ సురేశ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ విడుదల చేయనుంది.