Life Story: సామాన్య జీవితాలకు దగ్గరగా ఉండే లైఫ్ స్టోరీ 

ABN , Publish Date - Sep 11 , 2024 | 11:14 PM

సత్య కేతినీడి, షాలిని కొండేపూడి, దేవియాని శర్మ కీలక పాత్రధారులుగా  తెరకెక్కుతున్న చిత్రం 'లైఫ్ స్టోరీస్'.


 
సత్య కేతినీడి, షాలిని కొండేపూడి, దేవియాని శర్మ కీలక పాత్రధారులుగా  తెరకెక్కుతున్న చిత్రం 'లైఫ్ స్టోరీస్'. అక్జన్ ఎంటర్‌టైన్‌మెంట్, ప్లానెట్ గ్రీన్ స్టూడియోస్ పతాకంపై  ఉజ్వల్ కశ్యప్దర్శక నిర్మాణంలో రూపొందుతుంది. జీవితంలోని చిన్న, రోజువారీ క్షణాల్ని మనసుకు హత్తుకునే విధంగా చిత్రీకరణతో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తీసిన ఒక సంకలన  చిత్రమిది. ఈ నెల  14న  ప్రేక్షకుల ముందుకు రానుంది.  వివిధ వయసుల వ్యక్తుల నుండి విభిన్న కథలను  తీసుకుని తీసిన సినిమా ఇది. సాధారణ సంఘటనలు మన జీవితాలపై ఎలా తీవ్ర ప్రభావం చూపగలవో ఏ చిత్రంలో చూపిస్తున్నారు.  యానిమేటర్ నుంచి లైవ్-యాక్షన్ ఫిల్మ్ మేకింగ్‌లో తన నైపుణ్యాన్ని చూపిస్తూ ఉజ్వల్ కశ్యప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దృశ్యమాన కథనాన్ని భావోద్వేగ లోతుతో మిళితం చేసింది. అన్ని వయసుల ప్రేక్షకుల జీవితాలకు దగ్గరగా తీసిన చిత్రం. ప్రతి ప్రేక్షకుడి సినిమాతో కనెక్ట్ అవుతుంది అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు : విన్ను, పాటలు : రామ్ ప్రసాద్, సుపర్ణ వొంటైర్, బెంట్ ఆఫ్ మైండ్, సింజిత్ యర్రమిల్లి, డి ఓ పి : ప్రణవ్ ఆనంద, ఎడిటర్ : వినయ్
 

Updated Date - Sep 11 , 2024 | 11:14 PM