Raj Tarun marriage: రాజ్ తరుణ్ పై అతని ప్రేయసి లావణ్య సంచలన ఆరోపణలు
ABN , Publish Date - Jul 05 , 2024 | 12:43 PM
యువ నటుడు రాజ్ తరుణ్ మరోసారి వివాదాల వార్తల్లో నిలిచాడు. ఈసారి అతని ప్రేయసిని అని చెప్పుకుంటున్న లావణ్య అనే అమ్మాయి రాజ్ తరుణ్ పై నార్సింగ్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాది చేసింది. రాజ్ తరుణ్ తనని ప్రేమించి, పెళ్లి చేసుకుంటాను అని మోసం చేసి వదిలేసాడు అని ఆ ఫిర్యాదులో ఆమె పేర్కొంది
యువ నటుడు రాజ్ తరుణ్ మళ్ళీ వార్తల్లో వున్నాడు, ఈసారి కూడా వివాదమైన వార్తలోనే వున్నాడు. రాజ్ తరుణ్ పై అతని ప్రేయసిగా చెప్పుకునే లావణ్య అనే అమ్మాయి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. లావణ్య తన ఫిర్యాదులో రాజ్ తరుణ్ తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి వదిలేసి వెళ్లిపోయాడని చెపుతోంది. అయితే తామిద్దరూ విడిపోవడానికి ఒక సినీ నటి కారణమని ఇంకో సంచలన ఆరోపణ చేసింది లావణ్య. ఆ నాటితోపాటుగా ఆమె సోదరుడిపై కూడా నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది లావణ్య. (Raj Tarun's fiance Lavanya complained on him at Narsing Police Station)
తనకి బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయని లావణ్య చెప్పినట్టుగా తెలిసింది. రాజ్ తరుణ్ ను వదిలేయకపోతే చంపేసి బాడీ కూడా మాయం చేస్తామని బెదిరిస్తున్నారని ఫిర్యాదు లో లావణ్య పేర్కొన్నట్టుగా చెపుతున్నారు. తాను రాజ్ తరుణ్ తో 11 ఏళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నాను అని చెపుతోంది. గుడిలో పెళ్లి కూడా చేసుకున్నాం అనీ, కానీ తన సినిమాలో నటిస్తున్న హీరోయిన్ తో అఫైర్ పెట్టుకొని నన్ను వదిలేశాడు అని లావణ్య ఆరోపిస్తోంది. (Raj Tarun's fiance Lavanya complained on Raj Tarun that he promised to marry her, but now distance her)
మూడు నెలల క్రితం రాజ్ తరుణ్ తన ఇంటి నుంచి వెళ్లిపోయి దూరంగా ఉంటున్నాడు అని కూడా అంటోంది. తనకి రాజ్ తరుణ్ మాత్రమే ప్రపంచం అని, అతను నాకు కావాలి అని చెపుతోంది లావణ్య. తనకి న్యాయం చెయ్యమని చెపుతోంది. గతంలో తనను డ్రగ్స్ కేసులో కావాలనే ఇరికించారు అని కూడా చెపుతోంది. అప్పుడు అరెస్టయి 45 రోజులు జైల్లో వున్నాను అని చెపుతోంది. ఆ సమయంలో రాజ్ తరుణ్ నుండి తనకు ఎలాంటి సాయం రాలేదు అని ఆరోపిస్తోంది లావణ్య. (Raj Tarun's fiance complained on Raj Tarn that he distance her because he got affair with another actress)