ప్రేక్షకులను మెప్పించే పెళ్లి కథ

ABN , Publish Date - Nov 09 , 2024 | 06:18 AM

వివాహం నేపథ్యంలో పూర్తిగా కొత్త నటీనటులతో రూపొందుతున్న చిత్రం ‘లగ్గం టైమ్‌’. ప్రజోత్‌ కె వెన్నం దర్శకత్వంలో కె. హిమబిందు

వివాహం నేపథ్యంలో పూర్తిగా కొత్త నటీనటులతో రూపొందుతున్న చిత్రం ‘లగ్గం టైమ్‌’. ప్రజోత్‌ కె వెన్నం దర్శకత్వంలో కె. హిమబిందు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను దర్శకుడు సాగర్‌ కె. చంద్ర విడుదల చేశారు. ఇంటిల్లిపాదిని అలరించేలా సినిమా ఉండబోతోందని నిర్మాణ సంస్థ ట్వంటీయత్‌ సెంచరీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తెలిపింది. ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త తరహా అనుభూతిని ఇస్తుందని దర్శకుడు చెప్పారు. రాజేశ్‌ మేరు, నవ్య చిట్యాల హీరో హీరోయిన్లు.

Updated Date - Nov 09 , 2024 | 06:18 AM