Merge: లేడీ లయన్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 3 మూవీ ప్రారంభం

ABN , Publish Date - Jul 10 , 2024 | 07:39 PM

లేడీ లయన్ క్రియేషన్స్ పతాకం పై ప్రొడక్షన్ నెంబర్ 03 చిత్రం ఘనంగా ప్రారంభమైంది. రాజు గుడిగుంట్ల నిర్మాణంలో నూతన దర్శకుడు బి. విక్రమ్ ప్రసాద్ దర్శకత్వంలో జూలై 10న హైదరాబాద్‌లోని శ్రీ భద్రకాళి పీఠంలో డా. సింధు మాతాజీ ఆశీస్సులతో గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని మేకర్స్ ప్రారంభించారు. ఈ చిత్రానికి ‘మెర్జ్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

Merge Movie Launch Event

లేడీ లయన్ క్రియేషన్స్ (Lady Lion Creations) పతాకం పై ప్రొడక్షన్ నెంబర్ 03 చిత్రం ఘనంగా ప్రారంభమైంది. రాజు గుడిగుంట్ల నిర్మాణంలో నూతన దర్శకుడు బి. విక్రమ్ ప్రసాద్ దర్శకత్వంలో జూలై 10న హైదరాబాద్‌లోని శ్రీ భద్రకాళి పీఠంలో డా. సింధు మాతాజీ ఆశీస్సులతో గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని మేకర్స్ ప్రారంభించారు. ఈ చిత్రానికి ‘మెర్జ్’ (Merge) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రం‌లో జబర్దస్త్ రాము, అంబటి శ్రీను, శక్తి చైతన్య, పెరికల మాధురి, హరి తేజ, చంటి, దిలీప్, బాలరాజు తదితరులు నటించనున్నారు. (Merge Movie Opening Details)

Also Read- Bharateeyudu 2: ‘భార‌తీయుడు 2’కు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్..


Merge-Movie.jpg

పూజా కార్యక్రమాల అనంతరం నిర్మాత రాజు గుడిగుంట్ల మీడియాతో మాట్లాడుతూ.. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ఈ నెల 15వ తేదీన విజయవాడలో ప్రారంభించనున్నాము. నూతన దర్శకుడు విక్రమ్ ప్రసాద్ ఈ చిత్రాన్ని సైన్స్ ఫిక్షన్ తరహాలో రొటీన్‌గా కాకుండా ఓ వైవిధ్యభరిత చిత్రంగా తెరకెక్కించబోతున్నారు. టాలెంటెడ్ నటీనటులు నటిస్తున్న ఈ చిత్రాన్ని టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో తెరకెక్కించనున్నాం. మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని అన్నారు.

Read Latest Cinema News

Updated Date - Jul 10 , 2024 | 07:39 PM