Jewel Thief: కృష్ణ అభిమాని హీరోగా ‘జ్యువెల్ థీఫ్’.. టీజర్ వదిలిన 30 ఇయర్స్ పృధ్వీ..

ABN , Publish Date - Aug 17 , 2024 | 04:29 PM

కృష్ణసాయి, మీనాక్షి జైస్వాల్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న సినిమా ‘జ్యువెల్ థీఫ్’. శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా బ్యానర్‌పై పీఎస్ నారాయణ దర్శకత్వంలో.. మల్లెల ప్రభాకర్ నిర్మిస్తున్నారు. ప్రేమ, అజయ్, 30 ఇయర్స్ పృథ్వి, శివారెడ్డి, శ్రావణి, శ్వేతరెడ్డి వంటి నటీనటులు ఇతర పాత్రలలో నటించిన ఈ చిత్ర టీజర్‌ను శనివారం నటుడు 30 ఇయర్స్ పృధ్వీ చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.

Jewel Thief Teaser Launch Event

కృష్ణసాయి (Krishnasai), మీనాక్షి జైస్వాల్ (Meenakshi Jaiswal) హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న సినిమా ‘జ్యువెల్ థీఫ్’ (Jewel Thief). శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా బ్యానర్‌పై పీఎస్ నారాయణ (PS Narayana) దర్శకత్వంలో.. మల్లెల ప్రభాకర్ (Mallela Prabhakar) నిర్మిస్తున్నారు. ప్రేమ, అజయ్, 30 ఇయర్స్ పృథ్వి, శివారెడ్డి, శ్రావణి, శ్వేతరెడ్డి వంటి నటీనటులు ఇతర పాత్రలలో నటించిన ఈ చిత్ర టీజర్‌ను శనివారం నటుడు 30 ఇయర్స్ పృధ్వీ (30 Years Prudhvi) చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.

Also Read- Kalki 2898AD OTT: ‘కల్కి 2898AD’ ఓటీటీలోకి వచ్చేస్తోంది.. ఎప్పుడంటే?

టీజర్ విడుదల అనంతరం 30 ఇయర్స్ పృధ్వీ మాట్లాడుతూ.. ఈ ‘జ్యువెల్ థీఫ్’ సినిమాలో హీరో కృష్ణసాయి యాక్షన్ పార్టులు బాగా చేశాడు. ఆయన యాక్టింగ్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. ఈ మూవీలో నా రోల్ కూడా బాగుంది. సినిమా సూప‌ర్ హిట్ అవుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. నేను, కృష్ణసాయి సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులం. స‌మాజం కోసం కృష్ణ సాయి ఇంటర్నేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా కృష్ణసాయి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మంచితనం, మానవత్వం కలబోసిన వ్యక్తి. గ‌తంలోనే కృష్ణ‌సాయి డ్రగ్స్ మీద అవగాహన వీడియోలు చేశారు. నిజ జీవితంలోనూ రియల్ హీరో కృష్ణసాయి అని చెప్పుకొచ్చారు. (Jewel Thief Teaser Launched)


30-Years-Prudhvi.jpg

హీరో కృష్ణసాయి మాట్లాడుతూ... నేను సూపర్ స్టార్ కృష్ణ‌గారి అభిమానిని. ఆయన స్ఫూర్తితో సినిమాల్లోకి వ‌చ్చాను. ‘జ్యువెల్ థీఫ్’ ఓ సస్పెన్స్ థ్రిల్ల‌ర్. ఈ త‌రం ప్రేక్ష‌కుల‌కు బాగా న‌చ్చుతుంది. ఎంఎం శ్రీలేఖ అందించిన మ్యూజిక్ హైలెట్‌గా ఉంటుంది. ఒక‌ప్పుడు హీరోయిన్ ప్రేమ గారి సినిమాలు చూశాను. ఆమెతో క‌లిసి న‌టించాల‌న్న నా కల ఈ సినిమాతో నెరవేరింది. ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం ఎంతో కృషి చేశారు. వారందరికీ ధన్యవాదాలు. టీజర్ విడుదల చేసిన పృథ్వీగారికి కృతజ్ఞతలు అని అన్నారు. ప్రొడ్యూసర్ మల్లెల ప్రభాకర్ మాట్లాడుతూ... కృష్ణ సాయికి తగ్గ కథ ఇది. సినిమా నటీనటులు, చిత్ర యూనిట్ అందరూ బాగా చేశారు. ఇది చిన్న సినిమా కాదు, పేరున్న సీనియర్ నటీనటులు ఇందులో ఉన్నారు. త్వ‌ర‌లోనే సినిమాను థియేటర్స్‌లోకి తీసుకురానున్నామని తెలిపారు.

Read Latest Cinema News

Updated Date - Aug 17 , 2024 | 04:29 PM