రిలీజ్‌కు కృష్ణ చివరి చిత్రం

ABN , Publish Date - Jan 17 , 2024 | 06:08 AM

సూపర్‌స్టార్‌ కృష్ణ నటించిన చివరి చిత్రం ‘కృష్ణ విజయం’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అంబుజా మూవీస్‌ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి...

రిలీజ్‌కు కృష్ణ చివరి చిత్రం

సూపర్‌స్టార్‌ కృష్ణ నటించిన చివరి చిత్రం ‘కృష్ణ విజయం’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అంబుజా మూవీస్‌ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి మధుసూదన్‌ హవల్దార్‌ దర్శకత్వం వహించారు. నాగబాబు, సుహాసినీ, గీతాసింగ్‌ ముఖ్య పాత్రలు పోషించారు. త్వరలో విడుద ల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఇటీవలే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ, మహేశ్‌బాబు అభిమానులకు ప్రత్యేక షో వేశారు. పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కృష్ణగారి సినిమాకు దర్శకత్వం వహించడం తనకు దక్కిన అదృష్టమని దర్శకుడు తెలిపారు. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని ఆయన చెప్పారు. ఈ చిత్రానికి శ్రీలేఖ సంగీతం అందించారు.

Updated Date - Jan 17 , 2024 | 06:08 AM