KORA: ‘కోర’ ఇంటెన్స్ ఫస్ట్ లుక్.. యాక్షన్ ప్రియులకు పండగే..
ABN , Publish Date - Dec 01 , 2024 | 09:37 PM
కన్నడలో అత్యంత ప్రజాదరణ పొందిన నటులలో ఒకరైన యాక్షన్ ప్రిన్స్ ధృవ సర్జా తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. ఆయన సమర్పణలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘కోర’. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని తాజాగా మేకర్స్ విడుదల చేశారు.
ఇండియన్ స్క్రీన్ మీద యాక్షన్ చిత్రాలకు ఉండే క్రేజే వేరు. సరైన యాక్షన్ కంటెంట్ ఫిల్మ్ పడితే.. రికార్డులు బద్దలైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడలాంటి యాక్షన్ చిత్రాలు కన్నడ నుండి ఎక్కువగా వస్తున్నాయి. అలాగే యాక్షన్ హీరోలు కన్నడ నుంచి ఎక్కువగా వస్తున్నారు. కన్నడలో అత్యంత ప్రజాదరణ పొందిన నటులలో ఒకరైన యాక్షన్ ప్రిన్స్ ధృవ సర్జా తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. ఆయన సమర్పణలో సునామీ కిట్టి, చరిష్మా, పి మూర్తి ప్రధాన పాత్రలలో నటిస్తోన్న చిత్రం ‘కోర’. ఈ చిత్రానికి ఒరటాశ్రీ దర్శకుడు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్, రత్నమ్మ మూవీస్ పతాకాలపై డాక్టర్ ఎబి నందిని, ఎఎన్ బాలాజీ, పి మూర్తి సంయుక్తంగా నిర్మించారు. తాజాగా ‘కోర’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
Also Read-Pushpa 2 The Rule: ‘పుష్ప 2’.. ‘దేవర’లా కాదు కదా..
ఈ పోస్టర్‌ను గమనిస్తే.. హై ఆక్టేన్ యాక్షన్ ఓరియెంటెడ్‌గా చిత్రంగా ‘కోర’ ఉండబోతుందనేది తెలుస్తోంది. సునామీ కిట్టి ఆగ్రహావేశాలు ఈ లుక్‌లో కనిపిస్తున్నాయి. అతని ముఖం మీద గాయాలు, ఇంటెన్స్ లుక్‌ని చూస్తుంటే ఊచకోత కోసేందుకు రెడీగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ‘కోర’ చిత్రం ఉండబోతోందని మేకర్స్ చెబుతున్నారు. స్క్రీన్‌పై అందరికీ సరికొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా ఇందులో యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని, వాటిని చూసిన ప్రేక్షకులు థ్రిల్ అవుతారని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
ఎం.కె.మాత, మునిరాజు, నీనాసం అశ్వత్‌లు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సెల్వం మాతప్పన్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తుండగా, బిఆర్ హేమంత్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. కె. గిరీష్ కుమార్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ తెలియజేయనున్నారు.