Kalki 2898 AD: సినిమాపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి స్పందనిదే..

ABN , Publish Date - Jun 28 , 2024 | 09:52 PM

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’ చిత్రంపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట రెడ్డి ప్రశంసలు కురిపించారు. కుటుంబ సమేతంగా ‘కల్కి 2898 AD’ సినిమాని చూసిన ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా సినిమా అద్భుతం అంటూ కొనియాడారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మించిన చిత్రం ‘కల్కి 2898 AD’. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న విడుదలైన అఖండ విజయం దిశగా దూసుకెళుతోంది.

Kalki 2898 AD: సినిమాపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి స్పందనిదే..
Komatireddy Venkat Reddy About Kalki 2898 AD Movie

రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) నటించిన ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD) చిత్రంపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట రెడ్డి (Komatireddy Venkat Reddy) ప్రశంసలు కురిపించారు. కుటుంబ సమేతంగా ‘కల్కి 2898 AD’ సినిమాని చూసిన ఆయన ట్విట్టర్ ఎక్స్ వేదికగా సినిమా అద్భుతం అంటూ కొనియాడారు. నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మించిన చిత్రం ‘కల్కి 2898 AD’. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న విడుదలైన అఖండ విజయం దిశగా దూసుకెళుతోంది. శుక్రవారం ఈ సినిమాను తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఈ సినిమాను తన కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించారు. అనంతరం ఈ సినిమాపై ఆయన స్పందిస్తూ..

Also Read- Megastar Chiranjeevi: ప్రభుత్వ లక్ష్యం అదే.. మార్పు తీసుకురండి!

‘‘ఈ రోజు ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’ సినిమాను కుటుంబ సమేతంగా కలిసి చూడటం జరిగింది. మహాభారతాన్ని.. భవిష్యత్ కాలాన్ని సమ్మిళితం చేస్తూ.. దర్శకుడు నాగ్ అశ్విన్ అద్భుతంగా సినిమాను తెరకెక్కించారు. సినిమాలో లెజెండ్రీ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, బాలీవుడ్ నటి దీపికా పదుకొనే వంటి తారాగణం అద్భుతంగా నటించారు. టాలీవుడ్‌లో ప్రఖ్యాత నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో అశ్విని దత్, స్వప్నాదత్, ప్రియాంకా దత్ నిర్మాణంలో రూపుదిద్దుకున్న ‘కల్కి 2898 AD’ సినిమా ఓ విజువల్ వండర్. (Cinematography Minister)


Kalki-Prabhas.jpg

ఈ సినిమా మరింత అద్భుతంగా విజయవంతం కావాలని.. తెలంగాణ (Telangana) సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. సినిమాలు విజయవంతం అయితే.. పరిశ్రమ పచ్చగా ఉంటుంది.. లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది. ప్రతీ ఒక్కరు పౌరాణిక, ఆధునిక అంశాల కలయికలో వచ్చిన ఈ ‘కల్కి 2898 AD’ వంటి అద్భుతమైన సినిమాను ఈ తరం చూడాలని సినిమాటోగ్రఫీశాఖ మంత్రిగా కోరుకుంటున్నాను..’’ అని కోమటిరెడ్డి వెంకట రెడ్డి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Read Latest Cinema News

Updated Date - Jun 28 , 2024 | 09:52 PM