Kalki 2898AD: 'కల్కి 2898 ఏడి' లో కైరా పాత్రలో నటించిన ఈ నటి గురించి తెలుసా...

ABN , Publish Date - Jun 28 , 2024 | 01:04 PM

'కల్కి 2898ఏడి' సినిమాలో తెలుగు నటులతో చాలామంది నటీనటులు చిన్న చిన్న పాత్రల్లో మెరిశారు. ఆలా మెరిసిన పాత్రలో కైరా పాత్ర ఒకటి. దీపికా చేసిన సుమతిని రక్షించటం కోసం తన ప్రాణాలను కూడా ఇచ్చేస్తుంది కైరా. ఇంతకీ ఈ కైరా పాత్ర వేసింది ఎవరు, ఆమె గురించిన విశేషాలు.

Kalki 2898AD: 'కల్కి 2898 ఏడి' లో కైరా పాత్రలో నటించిన ఈ నటి గురించి తెలుసా...
Anna Ben as Kyra in Kalki 2898AD

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన 'కల్కి 2898 ఏడి' నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఇందులో కథానాయకుడిగా చేసిన ప్రభాస్ తో పాటు మిగతా భాషల నటీనటులు కూడా చాలామంది వున్నారు. లెజండరీ నటుడు అమితాబ్ బచ్చన్ అశ్వద్ధామ పాత్రలో సినిమాకే హైలైట్ అయ్యారు, అలానే ఇంకో లెజండరీ నటుడు కమల్ హాసన్ విలన్ గా రెండు సన్నివేశాల్లో కనిపించారు. అశ్వద్ధామ సినిమాలో సుమతి పాత్రలో కనిపించిన దీపిక పదుకోన్ ని రక్షించడానికి పూనుకుంటారు.

annaben.jpg

అదే సమయంలో సుమతిని రక్షించడానికి అశ్వద్ధామకి సాయంగా కైరా అనే అమ్మాయి కూడా ఉంటుంది. ఆమె తన ప్రాణాలను కూడా లెక్కచెయ్యకుండా పోరాడుతుంది, చివరికి ప్రాణాలని కోల్పోతోంది. ఒక త్యాగం చేసే పాత్రలో కైరా కనపడి ప్రేక్షకుల మదిలో ఉండిపోతుంది. అయితే ఈ కైరా పాత్ర పోషించింది ఎవరా అని నిన్నటి నుండి సినిమా ప్రేక్షకులు అంతర్జాలంలో వెతుకుతున్నారని తెలిసింది.

annabena.jpg

కైరా పాత్రలో మెరిసిన నటి మరెవరో కాదు అనా బెన్ అనే మలయాళ నటి. ఆమె ప్రముఖ మలయాళం స్క్రీన్ రైటర్ బెన్నీ నయరాంబలం కుమార్తె. ఈమె ఇప్పటివరకు మలయాళం సినిమాలలో నటించింది, ఈ 'కల్కి 2898ఏడి' ఆమె మొదటి తెలుగు సినిమా. ఆమె సినిమాల్లోకి 2019 లో 'కుంభ నంగి నైట్స్' అనే మలయాళం సినిమాతో పరిచయం అయింది. ఆ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. ఈ సినిమా నిర్మాతల్లో ప్రముఖ మలయాళం నటుడు ఫహద్ ఫాజిల్ కూడా వున్నారు. ఫహాద్ ఈ సినిమాలో ఒక ప్రధాన పాత్రలో కూడా కనిపిస్తారు.

annabenb.jpg

ఇక అనా బెన్ తన తదుపరి సినిమా 'హెలెన్' సినిమాతో మంచి పేరు గడించింది. ఈ సినిమా విజయంతో ఒక్కసారిగా అనా బెన్ పేరు మారుమోగింది అనే చెప్పాలి. ఈ సినిమాలో నటించిన అనా బెన్ కి చాలా అవార్డులు కూడా వచ్చాయి. ఈ సినిమాని హిందీలో జాన్వీ కపూర్ తో 'మిలి' గా రీమేక్ చేశారు.

annabenmamithabaiju.jpg

అనా బెన్ తరువాత సినిమా 'కప్పేలా' ఇది కూడా మలయాళంలో పెద్ద విజయం సాధించింది. ఈ సినిమాని తరువాత తెలుగులో 'బుట్ట బొమ్మ' పేరిట రీమేక్ చేశారు, కానీ మలయాళం అంత విజయం సాధించలేదు. ఇలా వరసగా మలయాళంలో మంచి సినిమాలు చేసుకుంటూ బిజీగా వున్నా నటీమణుల్లో అనా బెన్ ఒకరు.

annabenc.jpg

ఇప్పుడు 'కల్కి 2898ఏడి' సినిమాలో కైరా పాత్రలో నవ్వుతూనే ఉంటుంది అనా బెన్. ఆమె స్నేహితుడు మాత్రం ఎప్పుడూ నవ్వడు. సినిమాలో ఆమె ప్రాణాలు విడిచిపెట్టినప్పుడు కూడా నవ్వుతూనే ఉంటుంది, తన స్నేహితుడిని నవ్వమని చెపుతుంది. ఈ సినిమాతో ఆమె అన్ని భాషల ప్రేక్షకులకి పరిచయం అయింది.

Updated Date - Jun 28 , 2024 | 01:05 PM