ఆశించిన ఫలితాన్ని ఇచ్చారు

ABN , Publish Date - Nov 02 , 2024 | 07:07 AM

హీరో కిరణ్‌ అబ్బవరం నటించిన భారీ పీరియాడిక్‌ థ్రిల్లర్‌ సినిమా ‘క’. రీసెంట్‌గా విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రేక్షకులను థ్రిల్‌ చేసేలా ఈ చిత్రాన్ని రూపొందించిన దర్శకులుగా తొలి చిత్రంతోనే తమ ప్రతిభ

హీరో కిరణ్‌ అబ్బవరం నటించిన భారీ పీరియాడిక్‌ థ్రిల్లర్‌ సినిమా ‘క’. రీసెంట్‌గా విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రేక్షకులను థ్రిల్‌ చేసేలా ఈ చిత్రాన్ని రూపొందించిన దర్శకులుగా తొలి చిత్రంతోనే తమ ప్రతిభ నిరూపించుకున్నారు సుజీత్‌, సందీప్‌. సినిమా సక్సెస్‌ అయిన సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ‘సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ విజయం సాధిస్తేనే మనుగడ అనుకున్నాం. అందుకే పట్టుదలగా పనిచేశాం. ప్రేక్షకులు మేము ఆశించిన ఫలితాన్ని ఇచ్చారు. ఈ దీపావళిని ఎంతో స్పెషల్‌ చేశారు. థియేటర్లలో ప్రేక్షకులు సినిమా చూస్తూ చివరలో స్టాండింగ్‌ ఓవేషన్‌ ఇస్తున్నారు. మేము ‘క’ కథ అనుకునప్పుడు ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో అని భయపడ్డాం. కానీ, ఈ రోజు ప్రేక్షకులు కథకు చాలా కనెక్ట్‌ అవుతున్నారు. మూవీకి సామ్‌ సీఎస్‌ ఇచ్చిన మ్యూజిక్‌ పెద్ద ప్లస్‌ పాయింట్‌ అయ్యింది’ అని తెలిపారు. దర్శకుడు సందీప్‌ మాట్లాడుతూ ‘ సోషల్‌ మీడియాలో ఎక్కడైనా సినిమా గురించి నెగెటివ్‌గా వస్తే ప్రేక్షకులే వాటికి సమాధానాలు ఇస్తున్నారు. ఏ కథకైనా ప్రిమేజ్‌ ముఖ్యం. ‘క’ సినిమాకు మేము చేసింది అదే. ఏ కథ అయినా ఫలానా ఏ, బీ, సీ ఆడియెన్స్‌కు నచ్చుతుందని విభజించుకుంటాం. ‘క’ సినిమా మల్టీప్లెక్స్‌ ఆడియెన్స్‌కు బాగా రీచ్‌ అవుతుంది. సీ సెంటర్‌లో కొంత తక్కువగా ఆదరిస్తారు అనుకున్నాం. కానీ ఈ రోజు రిజల్ట్‌ చూస్తుంటే సీ సెంటర్‌ ఆడియెన్స్‌ మల్టీప్లెక్స్‌ ఆడియెన్స్‌ కన్నా ఎక్కువగా ఇష్టపడుతున్నారు. బడ్జెట్‌ కాదు సబ్జెక్ట్‌ బాగుంటే ఇంటర్నేషనల్‌ లెవెల్‌కు సినిమాలు తీసుకెళ్లవచ్చని డైరెక్టర్‌ రాజమౌళి చెప్పినట్లు మా రాబోయే సినిమాలను సరికొత్తగా రూపొందించే ప్రయత్నం చేస్తాం’ అని చెప్పారు.

Updated Date - Nov 02 , 2024 | 07:07 AM