King Nagarjuna: నాగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 4కె‌లో ఆ సినిమా రీ రిలీజ్!

ABN , Publish Date - Aug 13 , 2024 | 04:19 PM

కింగ్ నాగార్జున బర్త్‌డే (ఆగస్టు 29)‌ను పురస్కరించుకుని అక్కినేని ఫ్యాన్స్ అంతా ఎక్స్‌ట్రార్డినరీ సెలబ్రేషన్‌కి సిద్ధం అవుతున్నారు. ఈ మధ్య సెలబ్రిటీల బర్త్‌డేను పురస్కరించుకుని.. వారి ఓల్డ్ సినిమాలను సరికొత్తగా రీ రిలీజ్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఆ ట్రెండ్‌ను ఇప్పుడు నాగ్ ఫ్యాన్స్ కూడా కంటిన్యూ చేస్తున్నారు. కింగ్ నాగార్జున పుట్టినరోజుకు ఒక రోజు ముందు.. ఆగష్టు 28న, ఐకానిక్ మూవీ ‘మాస్’ను మళ్ళీ థియేటర్స్‌లోకి తీసుకువస్తున్నారు.

King Nagarjuna

కింగ్ నాగార్జున (King Nagarjuna) బర్త్‌డే (ఆగస్టు 29)‌ను పురస్కరించుకుని అక్కినేని ఫ్యాన్స్ (Akkineni Fans) అంతా ఎక్స్‌ట్రార్డినరీ సెలబ్రేషన్‌కి సిద్ధం అవుతున్నారు. ఈ మధ్య సెలబ్రిటీల పుట్టినరోజును పురస్కరించుకుని.. వారి ఓల్డ్ సినిమాలను సరికొత్తగా రీ రిలీజ్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఆ ట్రెండ్‌ను ఇప్పుడు నాగ్ ఫ్యాన్స్ కూడా కంటిన్యూ చేస్తున్నారు. కింగ్ నాగార్జున పుట్టినరోజుకు ఒక రోజు ముందు, ఆగష్టు 28న, ఐకానిక్ మూవీ ‘మాస్’ (Mass)ను మళ్ళీ థియేటర్స్‌లోకి తీసుకువస్తున్నారు. 4K ఫార్మాట్‌లో సరికొత్తగా ఈ సినిమా గ్రాండ్‌గా రీ రిలీజ్ కానుంది. దాదాపు 20 ఏళ్ల క్రితం విడుదలైన ‘మాస్’ అప్పటికి నాగార్జునకు హయ్యస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. (Mass Movie Ready to Re Release)

Also Read-Janhvi Kapoor: ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ..


డైరెక్టర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) దర్శకత్వం వహించిన ‘మాస్’ చిత్రాన్ని నాగార్జున తన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై గ్రాండ్‌గా నిర్మించారు. ఈ చిత్రంలో జ్యోతిక, ఛార్మి కౌర్, రఘువరన్, రాహుల్ దేవ్‌తో సహా ప్రముఖ నటీనటులు నటించారు. మాస్ కమర్షియల్ హిట్‌తో పాటు రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన అద్భుతమైన ఆల్బమ్.. మ్యూజికల్‌గా కూడా ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసేలా చేసింది. ఈ చిత్రానికి శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రఫీ అందించారు. బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘మాస్’ 4K (Mass 4K) ఫార్మాట్‌లో రీ రిలీజ్ కానుండటంతో ఈ యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌ను మరోసారి అద్భుతంగా ఎక్స్‌పీరియన్స్ చేయడానికి సిద్ధం కండి అని పిలుపునిస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్.


Mass-Movie.jpg

ఈ సినిమా స్టోరీ (Mass Movie Story) విషయానికి వస్తే.. అనాథ అయిన హీరో.. ఒక అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి కూడా ప్రేమిస్తుంది. కానీ ఆ అమ్మాయి సిటీలోనే పేరు మోసిన పెద్ద రౌడీ కుటుంబానికి చెందినది కావడంతో.. హీరో ఫ్రెండ్‌ని చంపేసి హీరోయిన్‌ని ఆ రౌడీ ఫ్యామిలీ తీసుకెళ్లిపోతుంది. హీరో ఆ రౌడీ ఫ్యామిలీని ఎలా ఎదుర్కొన్నాడు? చివరికి తను ప్రేమించిన అమ్మాయిని పొందగలిగాడా? వంటి ప్రశ్నలకు సమాధానమే ‘మాస్’ కథ. నాగార్జున కెరీర్‌లోనే పెద్ద హిట్‌గా నిలిచిన ‘శివ’ చిత్రాన్ని తలపించేలా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది.

Read Latest Cinema News

Updated Date - Aug 13 , 2024 | 04:19 PM