Darling: ప్రియదర్శి, నభా నటేష్‌ల ‘డార్లింగ్’ నుంచి ఖలసే సాంగ్ విడుదల

ABN , Publish Date - Jun 18 , 2024 | 08:13 PM

‘హను-మాన్’ మూవీ తర్వాత కె నిరంజన్ రెడ్డి ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌‌లో చేస్తున్న చిత్రం ‘డార్లింగ్’. ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్ పోషిస్తున్న కంప్లీట్ డిఫరెంట్ మూవీ ఇది. శ్రీమతి చైతన్య ఈ రోమ్-కామ్‌ను ప్రజెంట్ చేస్తున్నారు. అశ్విన్ రామ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్ర మ్యూజిక్ ప్రమోషన్స్‌ని మేకర్స్ స్టార్ట్ చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ఫ్రస్ట్రేషన్ ఆంథమ్ ‘ఖలసే’ని మేకర్స్ రిలీజ్ చేశారు.

Darling: ప్రియదర్శి, నభా నటేష్‌ల ‘డార్లింగ్’ నుంచి ఖలసే సాంగ్ విడుదల
Priyadarshi in Darling

పాన్ ఇండియా సెన్సేషన్ ‘హను-మాన్’ (Hanu Man) తర్వాత కె నిరంజన్ రెడ్డి ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌‌లో చేస్తున్న చిత్రం ‘డార్లింగ్’ (Darling). ప్రియదర్శి (Priyadarshi), నభా నటేష్ (Nabha Natesh) లీడ్ రోల్స్ పోషిస్తున్న కంప్లీట్ డిఫరెంట్ మూవీ ఇది. శ్రీమతి చైతన్య ఈ రోమ్-కామ్‌ను ప్రజెంట్ చేస్తున్నారు. అశ్విన్ రామ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్ర మ్యూజిక్ ప్రమోషన్స్‌ని మేకర్స్ స్టార్ట్ చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ఫ్రస్ట్రేషన్ ఆంథమ్ ‘ఖలసే’ (Khalasay Song)ని మేకర్స్ రిలీజ్ చేశారు.


Darling.jpg

ఈ చిత్ర సంగీత దర్శకుడు వివేక్ సాగర్ (Vivek Sagar) ఈ పాటను పెప్పీ నంబర్‌గా కంపోజ్ చేశారు. ఈ పాటను హనుమాన్ సిహెచ్‌తో కలిసి రామ్ మిరియాల పాడారు. రామ్ మిరియాల వాయిస్‌లో ఫన్ వైబ్ మరింత ఎనర్జీని క్రియేట్ చేసేలా ఉంది. ఈ పాట ఓ కామన్ మ్యాన్ ఫ్రస్ట్రేషన్‌ని తెలియజేస్తోంది. అతని చుట్టూ ఉన్న వ్యక్తులు లైఫ్‌లో చిల్‌ అవ్వమని చెబుతుంటారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. ఫ్రస్ట్రేషన్ ఆంథమ్‌గా ప్రమోట్ చేస్తున్న ఈ పాటలో ప్రియదర్శి తన డ్యాన్స్ స్కిల్స్ చూపించారు. ఇప్పటికే విడుదలైన టైటిల్‌ గ్లింప్స్ అద్భుతమైన స్పందన రాబట్టుకోగా.. ఇప్పుడు విడుదలైన పాట కూడా అందరినీ మెప్పిస్తున్నందుకు సంతోషంగా ఉందని చిత్ర బృందం ప్రకటించింది. కాగా, బ్రహ్మానందం, విష్ణు, కృష్ణతేజ్, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో పలువురు ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు.

Updated Date - Jun 18 , 2024 | 08:13 PM