కౌన్ బనేగా కరోడ్‌పతిలో.. పవన్‌పై ప్రశ్న
ABN , Publish Date - Sep 15 , 2024 | 02:46 AM
పవన్‌కల్యాణ్‌కు ఇండియా వైడ్ ఉన్న క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయం మరోసారి రుజువైంది. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ సీజన్ 16కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అమితాబ్ బచ్చన్...
పవన్‌కల్యాణ్‌కు ఇండియా వైడ్ ఉన్న క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయం మరోసారి రుజువైంది. ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ సీజన్ 16కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అమితాబ్ బచ్చన్.. కంటెస్టెంట్‌ను ఓ ఆసక్తికర ప్రశ్నను అడిగారు.. జూన్‌లో ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ సీఎంగా భాద్యతలు స్వీకరించిన వ్యక్తి ఎవరు? అని. ఇందుకు కంటెస్టెంట్ ఆడియన్స్ పోల్ ఎంచుకున్నారు. ఆడియన్స్‌లో 50శాతం మంది పవన్ అని జవాబు చెప్పారు. దీంతో ఈ సమాధానాన్ని లాక్ చేశారు. అది సరైన సమాధానం కావడంతో కంటెస్టెంట్ రూ. లక్ష అరవై వేలు గెలుచుకుని మరో ప్రశ్నకు వెళ్లారు.