Kanyaka: ఎవరు క్షమించినా అమ్మ క్షమించదు
ABN , Publish Date - Aug 27 , 2024 | 06:21 PM
ఈశ్వర్, శ్రీహరి, PVL వర ప్రసాదరావు, సర్కార్ కీలక పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం 'కన్యక'. శ్రీకాశీ విశ్వనాథ్ పిక్చర్స్ పతాకంపై KV అమర్, పూర్ణ చంద్రరావు, సాంబశివరావు నిర్మిస్తున్నారు.
ఈశ్వర్, శ్రీహరి, PVL వర ప్రసాదరావు, సర్కార్ కీలక పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం 'కన్యక'. శ్రీకాశీ విశ్వనాథ్ పిక్చర్స్ పతాకంపై కెవి అమర్, పూర్ణ చంద్రరావు, సాంబశివరావు నిర్మిస్తున్నారు. రాఘవేంద్ర తిరువాయి పాటి దర్శకుడు. ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిని ఎవరు క్షమించినా అమ్మవారు మాత్రం శిక్షిస్తుందని అనే పాయింట్ తో ఈ చిత్రం రూపొందుతుంది. నకిరేకల్, నర్సరావుపేట, చాగంటి వారిపాలెం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంది. ఆగష్టు 15 న పాటల్ని విడుదల చేశారు. 20న రాఖీ పండుగ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్ ను నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు విడుదల చేశారు. ఫస్ట్ టికెట్ ను శ్రీశైలం ఆ భ్రమరాంబ మల్లిఖార్జునస్వామి సన్నిధిలో దేవకి వెంకటేశ్వర్లు చేతుల మీదగా విడుదల చేసారు. ఈ చిత్రం ఇప్పుడు Bcineet OTT లో స్ట్రీమింగ్ అవుతుంది. వినాయక చవితి అన్ని ఓటీటీలో అందుబాటులో ఉంటుందని నిర్మాతలు తెలిపారు. .