UI The Movie: ఉపేంద్ర బర్త్‌డే స్పెషల్.. పవర్ ఫుల్ పోస్టర్ విడుదల

ABN , Publish Date - Sep 18 , 2024 | 07:21 PM

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర స్వీయ దర్శకత్వం వహిస్తున్న మూవీ ‘యూఐ ది మూవీ’. లహరి ఫిల్మ్స్, జి మనోహరన్ అండ్ వీనస్ ఎంటర్‌టైనర్స్ బ్యానర్లపై కెపీ శ్రీకాంత్ నిర్మిస్తున్నారు. నవీన్ మనోహరన్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఉపేంద్ర బర్త్‌డేని పురస్కరించుకుని చిత్రయూనిట్ ప్రేక్షకులకు డబుల్ ట్రీట్ ఇచ్చింది.

UI The Movie Still

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర (Kannada Super Star Upendra) స్వీయ దర్శకత్వం వహిస్తున్న మూవీ ‘యూఐ ది మూవీ’ (UI The Movie). లహరి ఫిల్మ్స్, జి మనోహరన్ అండ్ వీనస్ ఎంటర్‌టైనర్స్ బ్యానర్లపై కెపీ శ్రీకాంత్ నిర్మిస్తున్నారు. నవీన్ మనోహరన్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ సినిమాపై ఓ రేంజ్‌లో అంచనాలను పెంచేసింది. యూనిక్ టీజర్‌తో వీక్షకులను ఫాంటసీ వరల్డ్ లోకి తీసుకెళ్ళారు ఉపేంద్ర. ఇప్పుడీ సినిమా నుంచి ఉపేంద్ర బర్డ్ డే స్పెషల్‌గా డబుల్ ట్రీట్ ఇచ్చారు. అవేంటంటే..

Also Read- Jani Master: జానీ మాస్టర్‌పై పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు.. మ్యాటర్ సీరియస్


1. పవర్ ఫుల్ పోస్టర్

ఉపేంద్ర‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. మేకర్స్ ఓ పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో హార్స్ రైడ్ చేస్తూ కనిపించిన ఉపేంద్ర ఇంటెన్స్ లుక్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ పోస్టర్ స్పెషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

2. మేకింగ్ వీడియో

పవర్ ఫుల్ పోస్టర్‌తో పాటు మేకింగ్ వీడియోను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఈ మేకింగ్ వీడియో చూస్తే వావ్ అనాల్సిందే. ఈ సినిమాకు ఉపేంద్ర ఎంత కష్టపడుతున్నాడనేదానికి నిదర్శనంగా ఈ మేకింగ్ వీడియో నిలుస్తోంది. ఈ మూవీ‌ని అక్టోబర్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.


UI-The-Movie.jpg

ఇప్పటివరకూ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా.. యూట్యూబ్ మరియు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచాయి. ఉపేంద్ర కెరీర్‌లోనే హై బడ్జెట్ అండ్ క్రేజీ ప్రాజెక్ట్‌గా ఈ మూవీని గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ఇందులో రీష్మా నానయ్య (లీడ్ యాక్టర్), నిధి సుబ్బయ్య, మురళీ శర్మ మరియు పి రవిశంకర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ‘కాంతార’ ఫేమ్ అజనీష్ బి లోక్నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Also Read- Poonam Kaur: అప్పట్లో నా మాట పట్టించుకోలేదు.. త్రివిక్రమ్ పై పూనమ్‌ సంచలన వ్యాఖ్యలు

Read Latest Cinema News

Updated Date - Sep 18 , 2024 | 07:21 PM