Subrahmanya: ‘సుబ్రహ్మణ్య’ ఫస్ట్ లుక్‌ వదిలిన కన్నడ సూపర్ స్టార్

ABN , Publish Date - Sep 08 , 2024 | 10:19 PM

పాపులర్ యాక్టర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ పి.రవిశంకర్ దర్శకత్వంలో.. ఆయన కుమారుడు అద్వయ్‌ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘సుబ్రహ్మణ్య’. ఎస్‌జి మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల ఈ సోషియో ఫాంటసీ అడ్వెంచర్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ని కన్నడ సూపర్ స్టార్ చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.

Subrahmanya First Look Launch

పాపులర్ యాక్టర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ పి.రవిశంకర్ దర్శకత్వంలో.. ఆయన కుమారుడు అద్వయ్‌ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘సుబ్రహ్మణ్య’. ఎస్‌జి మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల ఈ సోషియో ఫాంటసీ అడ్వెంచర్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. శ్రీమతి ప్రవీణ కడియాల, శ్రీమతి రామలక్ష్మి సమర్పణలో ఇటీవల విడుదల చేసిన ప్రీ లుక్‌ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా వినాయక చతుర్థి‌ని పురస్కరించుకుని ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కన్నడ సూపర్ స్టార్ డా. శివ రాజ్‌కుమార్ చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.

Also Read- Jailer Villain: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ‘జైలర్’ విలన్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఈ పోస్టర్‌లో అద్వయ్‌ని టైటిల్ రోల్‌లో సుబ్రహ్మణ్యగా పరిచయం చేశారు. పొడవాటి జుట్టు, గడ్డం, స్పెషల్‌గా డిజైన్ చేసిన అవుట్ ఫిట్స్‌లో అద్వయ్‌ వావ్ అనేలా కనిపిస్తున్నాడు. తన లుక్స్‌లో ఇంటన్సిటీ కనిపిస్తోంది. విజువల్ ట్రీట్‌లా వున్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేదిగా ఉంది. ఈ చిత్రం ఇప్పటికే 60 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుందని, అలాగే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముంబయిలోని ప్రముఖ రెడ్ చిల్లీస్ స్టూడియోలో శరవేగంగా జరుగుతున్నాయని.. ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి ప్రముఖ స్టూడియోలలో VFX మరియు CGI పనులు జరుగుతున్నట్లుగా నిర్మాతలు తెలిపారు.


Advay.jpg

‘సుబ్రహ్మణ్య’ సినిమా టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లో ఉండనుంది. ఈ సినిమాకు ‘కెజియఫ్, సలార్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, విఘ్నేష్ రాజ్ సినిమాటోగ్రాఫర్. విజయ్ ఎం కుమార్ ఎడిటర్. ‘సప్త సాగరదాచే మరియు చార్లీ 777’ ఫేమ్ ఉల్లాస్ హైదూర్ ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. ‘సుబ్రహ్మణ్య’ చిత్రం పాన్ ఇండియా మూవీగా తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Read Latest Cinema News

Updated Date - Sep 08 , 2024 | 10:19 PM