సినిమా రివ్యూ: కనకమహాలక్ష్మి ఎలా ఉందంటే...
ABN , Publish Date - Nov 24 , 2024 | 10:58 PM
హార్రర్, సస్పెన్స్, క్రైమ్ జానర్ చిత్రాలకు ఎప్పటికీ ఎవర్‌గ్రీన్. వీటి విడుదలకు సీజన్‌తో పనిలేదు. కంటెంట్‌లో దమ్ముంటే ఎప్పుడు రిలీజ్ చేసిన ప్రేక్షకాదరణ పొందుతాయి. అలా విడుదలైన చిత్రం 'కనకమహాలక్ష్మి’.
సినిమా రివ్యూ: కనకమహాలక్ష్మి (Kanaka Mahalakshmi)
విడుదల తేది: 22-11-2024
నటీనటులు: మువ్వ, కిరణ్, పికెఆర్ ముక్త, చంద్రమహేష్, అనిల్ కుమార్, శ్రీధర్‌రెడ్డి, శుభ రాజేశ్వరి, అరవింద అగర్వాల్ తదితరులు
సినిమాటోగ్రఫీ: షేక్ మస్తాన్ షరీఫ్,
సంగీతం:చిన్ని కృష్ణ గారపాటి
ఎడిటింగ్ : నందమూరి హరి
పోస్ట్ ప్రొడక్షన్ హెడ్: శ్రీనివాస్ నేదునూరి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పైల రమేష్
సహ నిర్మాతలు:ఆకెళ్ళ శ్రీనివాసరావు, ఆకెళ్ళ సావిత్రి
కథ- నిర్మాత- దర్శకత్వం: పీకేఆర్
హార్రర్, సస్పెన్స్, క్రైమ్ జానర్ చిత్రాలకు ఎప్పటికీ ఎవర్‌గ్రీన్. వీటి విడుదలకు సీజన్‌తో పనిలేదు. కంటెంట్‌లో దమ్ముంటే ఎప్పుడు రిలీజ్ చేసిన ప్రేక్షకాదరణ పొందుతాయి. అలా విడుదలైన చిత్రం 'కనకమహాలక్ష్మి’. సస్పెన్స్ హారర్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉందంటే..
కథ:
ఓ అందమైన నాట్యగత్తె మీద కన్నేసిన క్షుద్ర మాంత్రికుడు ఆ అమ్మాయి వేరే వ్యక్తిని ఇష్టపడుతోందని తెలిసి ఆమెకు క్షుద్రపూజలు చేసిన గజ్జెలు బహుమానంగా ఇస్తాడు. ఆ గజ్జెలు కట్టుకుని ప్రియుడితో నాట్యం చేస్తూ రక్తం కక్కుకుని చనిపోతుంది. ప్రియురాలి మరణంతో తట్టుకోలేక ప్రియుడు కూడా అక్కడికక్కడే చనిపోతాడు. ఈ ఘటన చూసిన క్షుద్ర మాంత్రికుడు ప్రేమలో ఉన్న గాఢత, స్వచ్ఛత తెలుసుకుని ఆ గజ్జెలు మట్టిలో కప్పెటేస్తాడు.కొనాంనళ్లుకు పురావస్తు శాఖవారు ఓ ఏరియాలో వజ్రాలు ఉన్నాయని అన్వేషణ మొదలు పెడతారు. ఈ క్రమంలో కనకమహాలక్ష్మి అనే ఓ ప్రభుత్వ ఉద్యోగి పరిశోధన కోసం అక్కడికి వస్తుంది. ఆమెకు ఆ గజ్జెలు దొరుకుతాయి. ఆ తర్వాత ఆమె జీవితం ఎలా మలుపు తిరిగింది. వజ్రాలు ఉన్న ల్యాండ్ కబ్జా కోరల్లో చిక్కుకోకుండా కనకమహాలక్ష్మి చేసిన ప్రయత్నాలు ఫలించాయా? ఈ క్రమంలో వరుస హత్యలు చేస్తున్న సీరియల్ కిల్లర్ ఎవరు? అన్నది కథ.
విశ్లేషణ:
సినిమా ప్రారంభం సాదాసీదాగా ప్రారంభమైనా.. మాంత్రికుడి వల్ల డాన్సర్ చనిపోవడం, కనకమహాలక్ష్మి రావడం, ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్, వజ్రాత వేట ఇదంతా కూడా ఆసక్తికరంగా సాగుతుంది. నిడివి తక్కువ కావడంతో థియేటర్‌లో కూర్చున్న భావన కలగదు. స్ర్కీన్‌ప్తే గ్రిప్పింగ్‌గా సాగడంతో బోర్ కలగదు. చిన్న చిత్రాలు అంటే వెకిలి కామెడీ, అర్థం పద్దంలేని పంచ్ డైలాగులే అనుకుంటున్న తరుణంలో దర్శకుడు అలాంటివేమీ లేకుండా చక్కని సస్పెన్స్ అంశాలతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. ప్రథమార్ధంలో టిపికల్ స్ర్కీన్ ప్లే వల్ల కథను అర్థం చేసుకోవడానికి కాస్త టైమ్ పడుతుంది. అది కాస్త మైనస్. నటీనటులు విషయానికొస్తే.. కథానాయకుడు కిరణ్ చక్కగా నటించాడు. ఈ చిత్రంతో తనకు మంచి పాత్రలు దక్కే అవకాశం ఉంది. టైటిల్ రోల్ పోషించిన నటి మువ్వ తన నటనతో ఆకట్టుకుంది. చక్కని భావోద్వేగాలు పంచింది. కన్నీరు తెప్పిస్తుంది, భయపెడుతుంది. దర్శకుడు చంద్ర మహేష్ అతిథి పాత్రలో అలరించారు. మిగత పాత్రధారులు పరిఽధి మేరకు నటించారు. షేక్ మస్తాన్ షరీఫ్ కెమెరా పనితనం ఆకట్టుకుంది. సంగీతం కూడా సినిమాకు ఎసెట్‌గా ఉంది. హారర్ సన్నివేశాలను చక్కగా ఎలివేట్ చేశాడు. దర్శక నిర్మాత పీకేఆర్ రెండు విభిన్న పాత్రల్లో మెరిశారు. చిన్న చిత్రమే అయినా సాంకేతికంగా బావుంది. నిర్మాణ విలువలు ఫర్వాలేదు. మౌత్‌టాక్ బావుంటే కనక మహాలక్షీ మంచి సినిమాగా ముందుకెళ్తుంది.
ట్యాగ్‌లైన్: కనకమహాలక్ష్మీ గజ్జెల సౌండ్ అదిరింది