Kamal Haasan: ‘కల్కి 2898 AD’ చూసిన కమల్ రియాక్షన్ ఏంటంటే?
ABN , Publish Date - Jun 30 , 2024 | 04:59 PM
సినిమా అనేది ఒక ప్రత్యేక భాష అని, అలాంటి సినిమాపై మనమే భాషను బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తున్నామని అగ్రనటుడు కమల్ అభిప్రాయపడ్డారు. గురువారం విడుదలైన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాన్ని ఆయన చెన్నైలో ప్రత్యేకంగా వీక్షించారు. అనంతరం మీడియాతో సినిమా గురించి పంచుకున్నారు.
సినిమా అనేది ఒక ప్రత్యేక భాష అని, అలాంటి సినిమాపై మనమే భాషను బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తున్నామని అగ్రనటుడు కమల్ హాసన్ (Kamal Haasan) అభిప్రాయపడ్డారు. గురువారం విడుదలైన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రాన్ని ఆయన చెన్నైలో ప్రత్యేకంగా వీక్షించారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడుతూ... పురాణానికి సైన్స్ ఫిక్షన్ జోడించి దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) తెరకెక్కించిన తీరు అద్భుతం. ఇలాంటి ప్రాజెక్టులో నేను భాగస్వామి కావడం సంతోషంగా ఉంది. ‘కల్కి’ తొలి భాగంలో నా పాత్ర చిన్నదిగానే ఉంటుంది. రెండో భాగంలో పూర్తిస్థాయిలో ఉంటుంది. సినిమా చూస్తుంటే బాలల చిత్రంగా ఉంది. మనలోని ప్రతి ఒక్కరిలో అల్లరితనం ఉంది. ఈ సినిమాలో పాటలు లేవు అని ధైర్యంగా చెప్పవచ్చు. ఫైట్ సన్నివేశాలున్నాయి. గతంలో జేమ్స్ బాండ్ చిత్రాలు ఇదే కోవలో ఉండేవి. వాటిని ప్రేక్షకులు విశేషంగా ఆదరించిన సందర్భాలు అనేకం. అలాంటిదే ఈ చిత్రం కూడా.
Also Read- C Aswani Dutt: అమితాబ్ నా కాళ్లకి నమస్కరించినప్పుడు.. నా పరిస్థితి ఇదే!
ఒక సాధారణ ప్రేక్షకుడిలా ఎంతో ఆసక్తిగా ఈ సినిమాను తిలకించా. సినిమా విజయానికి భాషతో పనిలేదు. అసలు సినిమానే ఓ ప్రత్యేక భాష. అలాంటి సినిమాపై మనమే బలవంతంగా భాషను రుద్దేందుకు ప్రయత్నిస్తున్నాం. ‘మరోచరిత్ర’ చిత్రం తెలుగు చిత్రమైనప్పటికీ అన్ని భాషల్లో ఘన విజయం సాధించింది. ఇదే సినిమాకు భాష అక్కర్లేదని చెప్పడానికి ఓ మంచి ఉదాహరణ’’ అని పేర్కొన్నారు.
ఇదే కార్యక్రమంలో ‘ఇండియన్ 2’ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘ఇండియన్-2’ (Indian 2) చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించి.. చెన్నై, ముంబైలలో పూర్తి చేశాం. సింగపూర్‌లో నిర్వహించి, మళ్లీ స్వదేశంలో ప్రమోషన్ కార్యక్రమాలు చేపడుతాం. ఆ సినిమా కూడా ప్రేక్షకులను చక్కగా ఎంటర్‌టైన్ చేస్తుంది అని కమల్ వివరించారు. కాగా, ‘కల్కి 2898 AD’ సినిమాలో కమల్ హాసన్ యస్కిన్ అనే ఓ వైవిధ్యభరితమైన పాత్రలో నటించారు.
Read Latest Cinema News