Kamal Haasan: ఇండియన్-2 రూమర్స్‌పై కమల్‌ క్లారిటీ!

ABN , Publish Date - Jul 07 , 2024 | 05:47 PM

విశ్వనటుడు కమల్‌హాసన్ (Kamal Haasan)  తన తాజా చిత్రం ఇండియన్-2’ (Indian2) ప్రమోషన్స్ లో  బిజీగా ఉన్నారు. ఇటీవల సింగపూర్‌ వెళ్లారు. అక్కడ నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. తనకు ‘భారతీయుడు 2’  కంటే ‘భారతీయుడు 3’ (Indian 3) ఎక్కువగా నచ్చిందని అన్నారు.

విశ్వనటుడు కమల్‌హాసన్ (Kamal Haasan)  తన తాజా చిత్రం ఇండియన్-2’ (Indian2) ప్రమోషన్స్ లో  బిజీగా ఉన్నారు. ఇటీవల సింగపూర్‌ వెళ్లారు. అక్కడ నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. తనకు ‘భారతీయుడు 2’  కంటే ‘భారతీయుడు 3’ (Indian 3) ఎక్కువగా నచ్చిందని అన్నారు. కొందరు నెటిజన్లు ఆ కామెంట్లను మరోలా అర్థం చేసుకున్నారు. ‘భారతీయుడు 2’  అవుట్‌పుట్‌ బాగా రాలేదేనేమో అంటూ సోషల్‌ మీడియాలో చర్చ జరగుతున్నాయి. ఈ విషయం కమల్‌ దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. చెన్నైలో శనివారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  

‘‘భారతీయుడు-2’ గురించి నేను చెప్పిన విషయాన్ని కొందరు మరో యాంగిల్‌లో అర్థం చేసుకున్నారు. భారతీయుడు రెండో పార్ట్‌ కంటే మూడో పార్ట్‌ బాగా నచ్చిందని చెప్పాను. అలా అని రెండో భాగం బాగోలేదని కాదు. సాంబారు, రసంతో కూడిన భోజనాన్ని ఇష్టంగా తింటాం. పాయసం ఉంటే మరింత ఆసక్తి చూపిస్తాం కదా. అలానే పలు అంశాల్లో భారతీయుడు మూడో భాగం నన్ను ఆకట్టుకుంది’’ అని క్లారిటీ ఇచ్చారు.

Indian-2.jpg

‘‘నా కెరీర్‌లో ‘భారతీయుడు 2’ కోసమే ఎక్కువ శ్రమించా. ఈ సినిమా కోసం ఆరేళ్లపాటు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం. లాక్‌డౌన్‌, సెట్స్‌లో ప్రమాదం, అనారోగ్యం కారణంగా కొందరు నటులు మరణించడం.. ఇలా ఊహించని ఘటనలు చోటుచేసుకున్నాయి. సేనాపతి క్యారెక్టర్‌కు సంబంధించి వేసుకునే దుస్తులు నుంచి వాడే పెన్ను వరకు అన్నింటిలోనూ దర్శకుడు శంకర్‌ జాగ్రత్త తీసుకున్నారు’’ అని కమల్‌ తెలిపారు. 3:04 గంటల రన్‌టైమ్‌తో ఈ నెల 12న విడుదల కానుంది. మరో ఆరు నెలల్లో పార్ట్‌ 3ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

Updated Date - Jul 07 , 2024 | 06:16 PM