Kalki 2898AD collections: పడిపోయిన ఐదో రోజు కలెక్షన్స్, ఇలా అయితే...

ABN , Publish Date - Jul 02 , 2024 | 02:55 PM

నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన సైన్స్ ఫిక్షన్ సినిమా 'కల్కి 2898ఏడి' ఐదో రోజు కలెక్షన్స్ ధారుణంగా పడిపోయాయి అని అంటున్నారు. జూన్ 27న విడుదలైన ఈ సినిమా మొదటి నాలుగు రోజులు బాగానే ఆడినా, ఇప్పుడు కల్కేషన్స్ పడిపోవటంతో ముందు ముందు ఎలా ఉంటుందో అని ఒక చర్చ నడుస్తోంది

Kalki 2898AD collections: పడిపోయిన ఐదో రోజు కలెక్షన్స్, ఇలా అయితే...
A still from Kalki 2898AD

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ సినిమా 'కల్కి 2898ఏడి' జూన్ 27న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ఓపెనింగ్స్ కలక్షన్స్ అయితే చాలా బాగా వచ్చాయి, మొన్న ఆదివారం వరకు కలెక్షన్స్ బాగానే వున్నాయి అని అంటున్నారు. అయితే నిన్న సోమవారం మాత్రం ఈ సినిమా కలెక్షన్స్ చాలా ధారుణంగా పడిపోయాయి అని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. సోమవారం 60 శాతానికి పైగా కలెక్షన్స్ పడిపోయాయి అని కూడా అంటున్నారు.

అలాగే గత కొన్ని నెలల నుండి తెలుగు సినిమా కలెక్షన్స్ పై ఒక దుమారం రేగుతూనే వుంది. విడుదలైన సినిమా కలెక్షన్స్ అన్నీ నిజమైనవా కావా అని. ఈ చర్చ ఇప్పటిది కాదు, గత కొన్ని నెలలుగా అటు పరిశ్రమలో, ఇటు సాంఘీక మాధ్యమాల్లో కూడా బాగా నడుస్తోంది. ఎందుకంటే ఇంతకు ముందు ప్రభాస్ సినిమా 'సలార్' కొన్ని ఏరియాస్ లో బాగా ఆడింది అంటారు, కొన్ని ఏరియాస్ లో లాభాలు రాలేదు అని అంటారు, ఇందులో ఎంత నిజం ఉందొ తెలీదు. అలాగే మహేష్ బాబు నటించిన 'గుంటూరు కారం' సినిమాకి కూడా ఈ కలెక్షన్స్ వివాదం పెద్ద చర్చ అయింది, రచ్చ కూడా అయిన సంగతి తెలిసిందే.

Kalki-1.jpg

'కల్కి 2898ఏడి' కలెక్షన్స్ నాలుగు రోజులు బాగున్నా, ఐదో రోజు బాగా పడిపోవటం మంగళవారం కూడా అలానే ఉండటంతో ఇప్పుడు ఈ సినిమా పరిస్థితి ఏంటి అని ఇంకో చర్చ నడుస్తోంది. అలాగే ఈ సినిమాలో కర్ణుడు, అర్జునుడు, అశ్వద్ధామ లాంటి మహాభారతంలోని పాత్రల గురించి కూడా సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన చర్చ నడుస్తోంది. ప్రముఖ ప్రవచన కర్త అయిన శ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు లాంటి వారు కూడా ఈ సినిమాలో చూపించిన పౌరాణిక పాత్రల గురించి తన సామాజిక మాధ్యమంలో ఒక ప్రవచనం కూడా పెట్టారు.

అయితే ఈ సినిమా ఐదు రోజులకి గాను సుమారు రూ. 343 కోట్లు కలెక్టు చేసిందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు, మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకి సుమారు రూ. 600 కోట్లకి పైగా బడ్జెట్ అయిందని అంటున్నారు. ప్రభాస్ తో పాటు, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి లెజండరీ నటులు నటించారు. ఇంకా దీపికా పదుకోన్, దిశా పటాని, బ్రహ్మానందం, శోభన ఇలా చాలామంది నటీనటులు వున్నారు.

Updated Date - Jul 02 , 2024 | 05:30 PM