Kaliyugam 2064: ‘కలియుగమ్ 2064’ ఫస్ట్ లుక్ వదిలిన లెజండరీ డైరెక్టర్
ABN , Publish Date - Nov 15 , 2024 | 08:07 PM
రీసెంట్‌గా ఫ్యూచర్‌ని బేస్ చేసుకుని కలియుగం కాన్సెప్ట్‌తో ప్రభాస్ ‘కల్కి 2898 AD’ చిత్రం వచ్చి మంచి విజయం సాధించింది. ఈ చిత్రంలో ఫ్యూచర్‌ని ఏ విధంగా చూపించారో తెలిసిందే. ఇప్పుడు మరో చిత్రం కలియుగాన్ని బేస్ చేసుకుని వస్తోంది. ఆ చిత్ర వివరాల్లోకి వెళితే..
ఆర్.కె. ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కె.ఎస్. రామకృష్ణ నిర్మాతగా.. శ్రద్ధా శ్రీనాథ్, కిషోర్ ప్రధాన పాత్రల్లో అడ్వెంచర్ సైన్సు ఫిక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘కలియుగమ్ 2064’. ఈ చిత్రం అన్ని హంగులు పూర్తి చేసుకుని ప్రపంచ వ్యాప్తంగా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. కలియుగం బేస్ చేసుకుని ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు 2064 అంటే.. ఫ్యూచర్‌లో మనుషులు ఎలా ఉండబోతున్నారు? ఎలా బతుకబోతున్నారు? ఎలా చావబోతున్నారు అనే అంశాలతో ఈ సినిమా కథ, కథాంశం ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. తెలుగు, తమిళ్ బైలింగ్వల్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను లెజండరీ డైరెక్టర్ మణిరత్నం విడుదల చేశారు. వినూత్న కథాంశంతో రాబోతున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలని తెలుపుతూ.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు మణిరత్నం.
Also Read-Daaku Maharaaj: ‘డాకు మహారాజ్’ టైటిల్ టీజర్ ఎలా ఉందంటే..
ఫస్ట్ టైమ్ దర్శకుడు మణిరత్నం ఇలా తెలుగు సినిమా పోస్టర్ విడుదల చెయ్యడం విశేషం. సినిమా కాన్సెప్ట్, పోస్టర్ బాగుందని చిత్ర యూనిట్ సభ్యులతో చాలా సేపు ముచ్చటించడం గొప్ప విషయం. తెలుగులో హీరో నానితో ‘జెర్సీ’ మూవీలో యాక్ట్ చేసిన శ్రద్ధా శ్రీనాథ్ ఈ సినిమాలో ఒక విభిన్నమైన పాత్రలో నటించిందని.. అలాగే తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అనేక చిత్రాల్లో అద్భుతమైన పాత్రల్లో యాక్ట్ చేసిన కిషోర్ ఈ మూవీలో మరో కీలకమైన పాత్రలో చాలా అద్భుతంగా యాక్ట్ చేశారని మేకర్స్ వెల్లడించారు.
ఈ మూవీ ఇప్పటి జెనరేషన్‌కి చాలా అవసరం. ఇది యువత, ఫ్యామిలీ, పిల్లలు అందరూ కలిసి చూడదగ్గ మూవీ.. ఈ మూవీని అందరూ చూసి, మా ఈ కొత్త ప్రయత్నాన్ని ఆదరించాలని కోరుతున్నామని, ఈ చిత్ర విజువల్ ఎఫెక్ట్స్ మరియు కంప్యూటర్ గ్రాఫిక్స్ నార్వేలో చేయబడ్డాయని.. త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని నిర్మాత కె.ఎస్. రామకృష్ణ తెలిపారు.