Kalinga: ‘కళింగ’ మూవీ రిజల్ట్‌పై టీమ్ స్పందనిదే..

ABN , Publish Date - Sep 15 , 2024 | 07:38 PM

‘కిరోసిన్’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ధృవ వాయు ఇప్పుడు ‘కళింగ’తో దర్శకుడిగా, హీరోగా ప్రేక్షకులముందుకు వచ్చారు. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 13న విడుదలై పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుని సక్సెస్‌ఫుల్ థియేటర్లలో నడుస్తోంది. సినిమా సక్సెస్‌పై మేకర్స్ ఎలా రియాక్ట్ అయ్యారంటే..

Kalinga Movie Success Meet

‘కిరోసిన్’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ధృవ వాయు (Dhruva Vaayu) ఇప్పుడు ‘కళింగ’ (Kalinga)తో దర్శకుడిగా, హీరోగా ప్రేక్షకులముందుకు వచ్చారు. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 13న విడుదలై పాజిటివ్ టాక్‌ని సొంతం చేసుకుని సక్సెస్‌ఫుల్ థియేటర్లలో నడుస్తోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్‌మీట్‌ను నిర్వహించి.. ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.

Also Read- Manchu Family: మంచు ఫ్యామిలీలో అసలేం జరుగుతోంది..

ఈ సక్సెస్‌మీట్‌లో హీరో, దర్శకుడు ధృవ వాయు మాట్లాడుతూ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాలాంటి ఓ కొత్త వ్యక్తి వచ్చి సినిమాను తీయడం.. హిట్టు కొట్టడం.. హౌస్ ఫుల్స్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. మీడియా సపోర్ట్ వల్లే ఇదంతా జరిగింది. వారి సహకారం వల్లే ఇంత పెద్ద హిట్ అయింది. వర్డ్‌ ఆఫ్ మౌత్‌తో మా సినిమా అందరికీ మరింత చేరువ అవుతోంది. మా సినిమాను ప్రేక్షకులు ఇంత ఇష్టపడుతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. మా చిత్రంలోని విజువల్స్, అమ్మవారిని చూపించిన తీరు ఇలా ప్రతీ ఒక్క అంశం గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటుంటే చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా చిత్రాన్ని ఆదరిస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్. కంటెంట్ ఉంటే సినిమాను హిట్ చేస్తామని మరోసారి తెలుగు ఆడియెన్స్ నిరూపించారని అన్నారు. హీరోయిన్ ప్రగ్యా నయన్ మాట్లాడుతూ.. ‘‘నన్ను ప్రేక్షకులంతా కూడా పద్దు అనే పిలుస్తున్నారు. నా పాత్రకు ఇంత మంచి రెస్పాన్స్ వచ్చినందుకు ఆనందంగా ఉంది. గత మూడేళ్లుగా ఈ చిత్రం కోసం పని చేశాను. ఈ రోజు ఈ సక్సెస్ చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా దర్శక, నిర్మాతలకు థాంక్స్’’ అని తెలిపారు. (Kalinga Movie Success Meet)


Kalinga-Movie.jpg

నిర్మాతలు దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్‌లు మాట్లాడుతూ.. ‘‘మా డైరెక్టర్ ఈ సినిమా మీద ముందు నుంచీ ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఆయన నమ్మకమే ఈ సినిమాను ఇక్కడి వరకు తీసుకు వచ్చింది. ఆయన వల్లే ఈ చిత్రం ఇంత గొప్పగా వచ్చింది. టెక్నికల్‌గా మూవీ అద్భుతంగా వచ్చిందని అందరూ ప్రశంసిస్తున్నారు. మా సినిమాకు ఇంత మంచి విజయాన్ని అందించిన ఆడియెన్స్‌కు థాంక్స్’’ అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో చీఫ్ మార్కెటింగ్ హెడ్ వంశీ, కెమెరామెన్ అక్షయ్‌లు మాట్లాడుతూ.. చిత్ర సక్సెస్‌పై సంతోషం వ్యక్తం చేశారు.

Also Read- Jr NTR: ‘దేవర’ చూసే వరకు బ్రతికించమన్న అభిమాని కోసం ఎన్టీఆర్ ఏం చేశారంటే..

Also Read- Love Sitara: పెళ్లికి ముందే నిజాలు బయటపడ్డాయ్.. శోభితా ధూళిపాళ పెళ్లి అవుతుందా?

Read Latest Cinema News

Updated Date - Sep 15 , 2024 | 07:38 PM