కాలం సూపుల గాలంరా
ABN , Publish Date - Feb 20 , 2024 | 05:18 AM
చైతన్యరావు, భూమిశెట్టి జంటగా నటించిన చిత్రం ‘షరతులు వర్తిస్తాయి’. కుమార స్వామి దర్శకత్వంలో నాగార్జున సామల, శ్రీష్ కుమార్ గుండా, డాక్టర్ కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మించారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు...

చైతన్యరావు, భూమిశెట్టి జంటగా నటించిన చిత్రం ‘షరతులు వర్తిస్తాయి’. కుమార స్వామి దర్శకత్వంలో నాగార్జున సామల, శ్రీష్ కుమార్ గుండా, డాక్టర్ కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మించారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి ‘కాలం సూపుల గాలంరా’ అంటూ సాగే గీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి చేతుల మీదుగా యూనిట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘షరతులు వర్తిస్తాయి’ సినిమాను ప్రేక్షకులు ఎలాంటి షరతులు పెట్టకుండా చూసి విజయవంతం చేయాలి’ అని కోరారు. ఈ గీతానికి గోరేటి వెంకన్న సాహిత్యాన్ని అందించగా, రామ్ మిర్యాల ఆలపించారు. అరుణ్ చిలువేరు సంగీతం అందించారు. మానవ సంబంధాల్లోని మార్పులను ప్రతిబింబించే చిత్రమిదని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ వనమాలి, శేఖర్ పోచంపల్లి.