Euphoria : యువ సంగీత దర్శకుడికి తొలిసారి అవకాశం!

ABN , Publish Date - Jun 11 , 2024 | 02:58 PM

'శాకుంతలం’ (shaakuntalam) చిత్రం పరాజయం తర్వాత కొంత గ్యాప్‌ తీసుకున్న గుణశేఖర్‌ Guna sekhar) తన తాజా చిత్రాన్ని ప్రకటించారు.  ’యుఫోరియా’ (Euphoria) అనే టైటిల్‌తో యూత్‌ ఫుల్‌ సోషల్‌ డ్రామా తెరకెక్కిస్తున్నట్లు ఆయన తెలిపారు.

 Euphoria : యువ సంగీత దర్శకుడికి తొలిసారి అవకాశం!


'శాకుంతలం’ (shaakuntalam) చిత్రం పరాజయం తర్వాత కొంత గ్యాప్‌ తీసుకున్న గుణశేఖర్‌ Guna sekhar) తన తాజా చిత్రాన్ని ప్రకటించారు.  ’యుఫోరియా’ (Euphoria) అనే టైటిల్‌తో యూత్‌ ఫుల్‌ సోషల్‌ డ్రామా తెరకెక్కిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇటీవల ఈ చిత్రాన్ని ప్రకటించారాయన.  గుణ హ్యాండ్‌ మేడ్‌ ఫిలిమ్స్‌ బ్యానర్‌ పై నీలిమ గుణ నిర్మాతగా ఈ సినిమా రూపొందుతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్‌ ఇచ్చారు గుణశేఖర్‌. ఈ చిత్రానికి యంగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌, కీరవాణి తనయుడు కాల భైరవ (Kaala bhairava) సంగీతం అందిస్తున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ వేదికగా తెలిపారు.  అలాగే ఈ సినిమాకు సంబంధించి ఇతర వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది.

గుణశేఖర్‌ చిత్రాల్లో సంగీతాన్ని చక్కని ప్రాధాన్యం ఉంటుంది. ఆయన దర్శకత్వం వహించిన చిత్రాల్లో ఎక్కువశాతం మణిశర్మనే సంగీతం అందించారు. ఇళయరాజా, హరీశ్  జైరాజ్‌, తమన్  మినహా మరే సంగీత దర్శకుడిగా ఆయన సినిమాకు పని చేయలేదు. యువ సంగీత దర్శకులకు ఆయన అవకాశం ఇచ్చింది  లేదు. కానీ ’యుఫోరియా’ చిత్రానికి కాలభైరవకు సంగీత బాధ్యతలు అప్పగించడం విశేషం అనే చెప్పాలి.

గాయకుడిగా ఎన్నో హిట్‌ చిత్రాలకు పాటలు పాడిన కాలభైరవ 'నాన్నకూచి’ చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. మత్తు వదలరా; కలర్‌ ఫొటో, కార్తికేయ 2, గుర్తుందా శీతాకాలం, కృష్ణమ్మ చిత్రాలకు సంగీతం అందించారు. 

Updated Date - Jun 11 , 2024 | 03:01 PM