మగవాళ్లనూ వదల్లేదు

ABN , Publish Date - Aug 30 , 2024 | 05:59 AM

మాలీవుడ్‌లో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై జస్టిస్‌ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక పరిశ్రమను కుదిపేస్తోంది. తాజాగా మరికొందరు మలయాళ సినీ ప్రముఖులపై అత్యాచారం కేసులు నమోదయ్యాయి. నటి మిను మునీర్‌ ఆరోపణలతో బుధవారం నటుడు, సీపీఎం ఎమ్మెల్యే ముఖేశ్‌, హీరో జయసూర్యపై అత్యాచారం కేసు నమోదు చేశారు. వీరితో పాటు మరో

దర్శకుడు రంజిత్‌ బాలకృష్ణన్‌పై తాజా ఆరోపణ

మాలీవుడ్‌లో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై జస్టిస్‌ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక పరిశ్రమను కుదిపేస్తోంది. తాజాగా మరికొందరు మలయాళ సినీ ప్రముఖులపై అత్యాచారం కేసులు నమోదయ్యాయి. నటి మిను మునీర్‌ ఆరోపణలతో బుధవారం నటుడు, సీపీఎం ఎమ్మెల్యే ముఖేశ్‌, హీరో జయసూర్యపై అత్యాచారం కేసు నమోదు చేశారు. వీరితో పాటు మరో ఐదుగురిపైనా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. దీంతో ఇప్పటివరకూ 17 మందిపై కేసులు నమోదయ్యాయి.

అవకాశం ఇస్తానని...

మలయాళ దర్శకుడు రంజిత్‌ బాలకృష్ణన్‌ తనను లైంగికంగా వే ధించాడని బెంగాలీ నటి శ్రీలేఖ మిత్ర ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే అతను ఆడవాళ్లనే కాదు మగవాళ్లనూ వదల్లేదు అని కోజికోడ్‌కు చెందిన సజీర్‌ అనే వ్యక్తి సంచలన ఆరోపణలు చేశాడు. తనపైన 2012లో రంజిత్‌ లైంగిక దాడికి పాల్పడ్డాడు అని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు సజీర్‌ కేరళ డీజీపీకి ఫిర్యాదు చేశాడు. ‘‘సినిమా అవకాశం ఇస్తానని చెప్పి బెంగళూరులోని తాజ్‌ హోట్‌ల్‌కు అర్థరాత్రి పిలిపించుకున్నాడు. గదిలోకి వెళ్లాక నా దుస్తులు తొలగించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. నా ఫొటోలు తీశాడు. ‘వాటిని ఎవ రికి పంపావు’ అని అడిగితే ‘లోపలి గదిలో నటి రేవతి ఉన్నార’ని రంజిత్‌ నాతో చెప్పాడు. అయితే ఆమె నిజంగా అక్కడ ఉన్నారా? లేదా, వారిద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉందనేది నాకు తెలియదు’ అని సజీర్‌ చెప్పాడు.

పృథ్వీరాజ్‌ తగిన వ్యక్తి

అమ్మ (అసోసియేషన్‌ ఆఫ్‌ మలయాళ మూవీ ఆర్టిస్ట్స్‌) అధ్యక్ష పదవికి మోహన్‌లాల్‌ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో బాధ్యతలు నిర్వహించేందుకు హీరో పృథ్విరాజ్‌ సుకుమారన్‌ తగిన వ్యక్తి అని నటి మిను మునీర్‌, పార్వతి తిరువోతు అభిపాయ్రపడ్డారు. అమ్మ ఎగ్జిక్యూటివ్‌ ప్యానెల్‌ మూకుమ్మడి రాజీనామాపై నటి పార్వతి తిరువోతు స్పందించారు. అసోసియేషన్‌లో నిరంకుశ పాలన నడుస్తోందని ఆరోపించారు. మీడియా ముందుకొచ్చి మాట్లాడే అవకాశం లేకపోవడంతోనే రాజీనామా చేశామన్నారు. తమ నిర్ణయం పిరికితనంగా అనిపించిందనన్నారు. ఇంతమంది మహిళలు ధైర్యంగా బయటకొచ్చి ఫిర్యాదు చేస్తున్నా కేరళ ప్రభుత్వం విచారణలో నిర్లక్ష్యం చూపుతోందని మిను ఆరోపించారు.

కోలీవుడ్‌లోనూ కమిటీ

‘అడ్జె్‌స్టమెంట్‌’ పేరుతో సినిమా అవకాశాలు ఇస్తామని గాలం వేసేవారు ఎంతటివారైనా చెప్పుతో కొట్టాలని ‘నడిగర్‌ సంఘం’ ప్రధాన కార్యదర్శి, హీరో విశాల్‌ పిలుపునిచ్చారు. జస్టిస్‌ హేమ కమిషన్‌ తరహాలోనే కోలీవుడ్‌లోనూ నడిగర్‌ సంఘం ఆధ్వర్యంలో పది మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం అని చెప్పారు.

హేమ కమిటీకి సమంత ప్రశంసలు

మలయాళ చిత్రపరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలికితేవడంలో హేమ క మిటీ పనితీరు అద్భుతంగా ఉందని టాలీవుడ్‌ కథానాయిక సమంత ప్రశంసించారు. అలాగే ఈ కమిటీ ఏర్పాటుకు కారణమైన డబ్ల్యూసీసీ (ఉమెన్‌ ఇన్‌ సినిమా కలెక్టివ్‌) సంస్థనూ ఆమె అభినందించారు. ఆ సంస్థ సభ్యుల కష్టం వల్లే ఈ రోజు మహిళల సమస్యలు చర్చనీయాంశంగా మారాయని చెప్పారు. సినీ పరిశ్రమలో మహిళల సంరక్షణ కోసం ఆ సంస్థ అవిశ్రాంతంగా పాటుపడుతోందని అభినందించారు. ‘డబ్ల్యూసీసీ గురించి నాకు చాలా కాలంగా తెలుసు. ప్రభుత్వం హేమ కమిటీ ఏర్పాటు చేయడానికి ఆ సంస్థ తీసుకొన్న చొరవే కారణం. వారి పోరాటానికి నా కృతజ్ఞతలు’ అన్నారు.

Updated Date - Aug 30 , 2024 | 05:59 AM