Ap Cm Oath Ceremony: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి జూనియర్ ఎన్టీఆర్?

ABN , Publish Date - Jun 11 , 2024 | 07:32 PM

ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  ఈ కార్యక్రమానికి అగ్ర కథానాయకుడు చిరంజీవి హాజరుకానున్నారు.

Ap Cm Oath Ceremony: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి జూనియర్ ఎన్టీఆర్?

ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం (AP Cm Oath ceremony) చేయనున్నారు.  ఈ కార్యక్రమానికి అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi)హాజరుకానున్నారు. రాష్ట్ర విశిష్ట అతిథిగా హాజరు కావాలని కోరుతూ చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం అందింది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో చిరంజీవి విజయవాడ బయలుదేరారు. ఆయనతోపాటు జూనియర్‌ ఎన్టీఆర్‌కు (Jr Ntr) కూడా ఆహ్వానం అందింది. దేవర చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉన్న తారక్‌ కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు అయ్యే అవకాశం ఉంది. అలాగే రజినీకాంత్, మోహన్ బాబు, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్, నారా రోహిత్ తో పాటు మరికొందరు సినీ తారలకు ఆహ్వానం అందినట్లు సమాచారం.

Chiru.jpg

ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎన్టీఆర్‌ హాజరు అవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. అందుకు కారణం కొంతకాలంగా జూ.ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ విషయంలో నిశ్శబ్ధంగా ఉంటున్నారు. పలు సందర్భాంలో పార్టీ ప్రస్తావన తీసుకొచ్చినా ఆ టాపిక్‌ గురించి మాట్లాడటం లేదు. అయితే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన నారా చంద్రబాబునాయుడు 'ప్రియమైన మావయ్యకు శుభాకాంక్షలు’ అంటూ తారక్‌ ట్వీట్‌ చేశారు. దానికి చంద్రబాబు కూడా 'థ్యాంక్స్‌ అమ్మా’ అని రిప్లై ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అందుకున్న తారక్‌ హాజరు అవుతారా? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. 

Rajini.jpg

అలాగే మరో నటుడు అల్లు అర్జున్ కు  కూడా ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. ఆయన కూడా హాజరు అవుతారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో అల్లు అర్జున వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచి ట్రోలింగ్‌కు గురయ్యారు. అయినా బన్నీకి ఆహ్వానం పంపించి టీడీపీ హుందాగా వ్యవహరించిందని సోషల్‌ మీడియాలో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. 

Updated Date - Jun 11 , 2024 | 09:20 PM