Jr NTR: తారక్‌ చిన్నప్పుడు ఎలా ఉన్నాడో చూశారా?

ABN , Publish Date - Jun 22 , 2024 | 03:09 PM

పాత జ్ఞాపకాలు ఎప్పటికీ మధురమే! ఫొటోల రూపంలో ఆ జ్ఞాపకాలు పదిలంగా (old memory) ఉంటాయి. ఒకప్పటి ఫొటోలు చూసుకుంటే అలనాటి జ్ఞాపకాలు కళ్ల ముందు మెదులుతుంటాయి.

Jr NTR: తారక్‌ చిన్నప్పుడు ఎలా ఉన్నాడో చూశారా?



పాత జ్ఞాపకాలు ఎప్పటికీ మధురమే! ఫొటోల రూపంలో ఆ జ్ఞాపకాలు పదిలంగా (old memory) ఉంటాయి. ఒకప్పటి ఫొటోలు చూసుకుంటే అలనాటి జ్ఞాపకాలు కళ్ల ముందు మెదులుతుంటాయి. అలాంటి ఫొటోనే ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది. జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR) 1997లో మాంచెస్టర్‌లో జరిగిన యూరోపియన్  తెలుగు అసోసియేషన్  కన్వెన్షన్ వేడుకలో పాల్గొన్నారు. ఆ వేడుకలో సీనియర్‌ నటి శారద, జమున, గాయని సుశీల తదితరులు పాల్గొన్నారు. అదే కార్యక్రమానికి జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా హాజరు అయ్యారు. నిక్కరు, టీ షర్ట్‌ ధరించి శారద పక్కన కూర్చున్న తారక్‌ ఫొటో, వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. ఆ ఫొటోను అభిమానులు విపరీతంగా షేర్‌ చేస్తున్నారు. 

Updated Date - Jun 22 , 2024 | 03:09 PM