Pani: జోజు జార్జ్ సినిమా ఓటీటీలోకి రావడం లేదు.. కానీ తెలుగులో!

ABN , Publish Date - Dec 10 , 2024 | 05:46 PM

జోజు జార్జ్ తెలుగు ప్రేక్షకులకూ పరిచయమే. మలయాళంలో స్టార్ హీరో మరియు దర్శకుడిగా దూసుకెళుతోన్న జోజు జార్జ్ ఇటీవల నటించిన చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఆ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో ‘పని’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను తాజాగా మేకర్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జోజు జార్జ్ ఏమన్నారంటే..

Pani Movie Hero and Heroine

స్టార్ హీరో మరియు దర్శకుడు జోజు జార్జ్ నటించి, సూపర్ హిట్ అయిన మలయాళ చిత్రం ఇప్పుడు తెలుగులో ‘పని’ అనే టైటిల్‌తో ఈ నెల 13న విడుదల కాబోతోంది. అభినయ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాను ఆమ్ వర్డ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. రాజవంశీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు డైరెక్టర్ వీరశంకర్, తెలుగు ఫిలింఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్, నటుడు జెమినీ సురేష్ వంటి ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

Also Read- Big Twist: మోహన్ బాబు ఇంట్లోని పని మనిషి ఏం చెప్పిందంటే..


ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజ వంశీ మాట్లాడుతూ.. వర్క్ ఈజ్ గాడ్. మనం చేసే పని మనకు దేవుడు. ‘పని’ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది మంచి థ్రిల్లర్ సినిమా. 2 గంటల పాటు ఆడియెన్స్‌ను ఎంగేజ్ చేస్తుంది. ఈ చిత్రంలో జోజు జార్జ్ నటిస్తూ అద్భుతంగా రూపొందించారు. ఇలాంటి సినిమా చేయాలంటే నిజంగా ధైర్యం ఉండాలి. నటుడిగా ఆయన గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయాను. ఈ సినిమా ఈ నెల 20న ఓటీటీలో రావడం లేదు. తెలుగులో థియేటర్స్‌లో సక్సెస్ పుల్‌గా రన్ కంప్లీట్ చేసుకున్న తర్వాతే ఓటీటీలోకి వస్తుంది. ప్రేక్షకులు ఈ ‘పని’ మంచి విజయం అందిస్తారని కోరుకుంటున్నానని తెలిపారు. మలయాళ ప్రొడ్యూసర్ సిజో వడక్కన్ మాట్లాడుతూ.. పని సినిమా మలయాళం, కన్నడ, తమిళంలో మంచి విజయం సాధించింది. తెలుగులోనూ అలాంటి విజయాన్నే సాధిస్తుందని ఆశిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు.


Abhinaya.jpg

హీరో, దర్శకుడు జోజు జార్జ్ మాట్లాడుతూ.. ‘పని’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు వచ్చిన అతిథులకు థ్యాంక్స్. వాళ్లు నా గురించి గొప్పగా మాట్లాడటం సంతోషంగా ఉంది. నా దృష్టిలో మంచి సినిమాకు భాషా హద్దులు లేవు. ఏ భాషలో ప్రేక్షకులైనా ఆదరిస్తారు. తెలుగు చిత్రాల్లో నటించి మీ ఆదరణ పొందాను. ‘పని’ సినిమా కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్. మా టీమ్‌లోని ప్రతి మెంబర్ తన వర్క్‌ను అద్భుతంగా చేశారు. అభినయతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. పని మూవీ తెలుగు ఆడియెన్స్‌కు కూడా బాగా నచ్చుతుందని నమ్ముతున్నానని అన్నారు. నటి అభినయతో పాటు హాజరైన అతిథులందరూ ఈ సినిమా తెలుగులోనూ ఘన విజయం సాధిస్తుందని నమ్ముతున్నట్లుగా చెప్పుకొచ్చారు.

Also Read-Mohan Babu: అన్నదమ్ముళ్లులా కలిసి బ్రతకాలని కోరుకుంటే.. మోహన్ బాబు ట్వీట్ వైరల్

Also Read-Manchu Family: మనోజ్ హాస్పిటల్‌ల్లో.. మోహన్ బాబు ట్విట్టర్‌లో.. మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతుంది?

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Dec 10 , 2024 | 05:46 PM