Jhansi IPS: ట్రైలర్ విడుదల.. రాయ్ లక్ష్మీ నట విశ్వరూపం

ABN , Publish Date - Oct 21 , 2024 | 08:06 PM

రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రలో గురుప్రసాద్ దర్శకత్వంలో.. తమిళ, కన్నడ భాషలలో విడుదలై ఘన విజయాన్ని సాధించిన ‘ఝాన్సీ ఐపీఎస్’ తెలుగు చిత్రం ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని సోమవారం హైదరాబాద్‌లో మేకర్స్ ఘనంగా నిర్వహించారు. రాయ్ లక్ష్మీ మూడు పాత్రలలో నటించిన ఈ చిత్ర విశేషాలను నిర్మాత రామకృష్ణ గౌడ్ ఈ కార్యక్రమంలో తెలిపారు.

Jhansi IPS Trailer Launch Event

రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్రలో గురుప్రసాద్ దర్శకత్వంలో.. తమిళ, కన్నడ భాషలలో విడుదలై ఘన విజయాన్ని సాధించిన ‘ఝాన్సీ ఐపీఎస్’ (Jhansi IPS) తెలుగు చిత్రం ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని సోమవారం హైదరాబాద్‌లో మేకర్స్ ఘనంగా నిర్వహించారు. సీనియర్ హీరో సుమన్ చేతుల మీదుగా మేకర్స్ ఈ ట్రైలర్‌ను విడుదల చేసారు. ఈ చిత్ర తెలుగు హక్కులను ఆర్ కె ఫిలిమ్స్ అధినేత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ సొంతం చేసుకున్నారు. ట్రైలర్ విడుదల అనంతరం హీరో సుమన్ మాట్లాడుతూ.. రాయ్ లక్ష్మీ ఎంతో టాలెంటెడ్ ఆర్టిస్ట్. ట్రైలర్ చూశాను. ఫైట్స్ అదరగొట్టారు. తమిళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఇలాంటి చిత్రాలకు మంచి థియేటర్స్ దొరకాలి. ఈ చిత్రం తెలుగులో కూడా ఘన విజయం సాధించి నిర్మాత రామకృష్ణ గౌడ్‌కి మంచి పేరు, డబ్బు రావాలని కోరుకుంటున్నానని అన్నారు.

Also Read- Love Reddy: రెబల్‌ స్టార్ సపోర్ట్.. యూనిట్ పిచ్చ హ్యాపీ

చిత్ర నిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. సుమన్ గారి చేతుల మీదుగా ట్రైలర్ విడుదలైనందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాయ్ లక్ష్మీ త్రిపాత్రాభినయం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఆమె నట విశ్వరూపాన్ని ఈ చిత్రంలో చూస్తారు. సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడే యోధురాలిగా ఆమె ఇందులో కనిపిస్తారు. ఫైట్ మాస్టర్ థ్రిల్లర్ మంజు కంపోజ్ చేసిన 8 ఫైట్స్ రాయ్ లక్ష్మీ కెరీర్లో మైలు రాయిగా నిలిచిపోతాయి. ఈ చిత్రానికి కూడా ఫైట్స్ హైలెట్‌గా నిలుస్తాయి. రాయ్ లక్ష్మీ చేసిన మూడు క్యారెక్టర్స్ డిఫరెంట్ షేడ్స్‌లో ఉంటాయి. విద్యార్థులను మాదక ద్రవ్యాలకు అలవాటు చేసి, యువత భవిష్యత్‌ను పెడదారి పట్టించే డ్రగ్స్ ముఠా ఆటకట్టించే ఐపిఎస్ ఆఫీసర్‌గా, గ్రామాల్లో రౌడీల ఆగడాలకు అడ్డుకట్టవేసే ఉగ్రనారిగా, కుర్రకారును ఉర్రూతలూగించే గ్లామర్ పాత్రల్లో లక్మీ రాయ్ తన నట విశ్వ రూపాన్ని ప్రదర్శించారు. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని నవంబర్ రెండో వారంలో అత్యధిక థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని తెలిపారు.


Jhansi-IPS.jpg

తెలుగు నిర్మాతల మండలి సెక్రెటరీ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. విజయశాంతి నటించిన ‘కర్తవ్యం’ ఇలాంటి సినిమాలకు ఇన్స్పిరేషన్. ‘ప్రతిఘటన’ చిత్రం ఎలాంటి విజయాన్ని సాధించిందో, ఈ ‘ఝాన్సీ ఐపీఎస్’ చిత్రం కూడా ఘన విజయాన్ని సాధించాలని కోరుతున్నానని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో డాన్సర్, నటి ఆక్సాఖాన్.. నటుడు జెవిఆర్, సదాశివ రెడ్డి, భాస్కర్ రావు, హీరో కిరణ్, అగర్వాల్, జి ఏస్ రెడ్డి, లక్ష్మీ, దుబాయ్ డిస్ట్రిబ్యూటర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Also Read- The Substance: మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.. ఎలా తీశార్ర బాబు ఈ సినిమా! స్ట్రీమింగ్ ఎక్క‌డ అంటే

Also Read- Salman Khan: రావాలి అనిపించడం లేదు.. ఫ్రస్ట్రేషన్‌లో సల్మాన్ ఏమన్నాడో తెలుసా

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 21 , 2024 | 08:11 PM