Pawan Kalyan Swearing In: కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను...

ABN , Publish Date - Jun 12 , 2024 | 11:59 AM

కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అని పవన్ కళ్యాణ్ చెప్పగానే ప్రమాణస్వీకార సభా ప్రాంగణం అంతా ఒక్కసారిగా చప్పట్లతో మారుమోగింది. పవన్ కళ్యాణ్ అన్నయ్య మెగా స్టార్ చిరంజీవి మోహంలో చిరునవ్వు కదలాడింది.

Pawan Kalyan Swearing In: కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను...
Konidela Pawan Kalyan

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో ఆప్యాయతతో చంద్రబాబుని ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరూ తమ మధ్య ఎంత స్నేహభావం ఉందొ తెలియచేశారు. చంద్రబాబు నాయుడు తరువాత గవర్నరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

chirupawan.jpg

పవన్ కళ్యాణ్ మైక్ ముందుకు రాగానే జనం హోరెత్తి జేజేలు పలికారు. సభా ప్రాంగణం అంతా ఒక్కసారిగా అరుపులతో నిండిపోయింది. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను... అని పవన్ కళ్యాణ్ తన ప్రమాణ స్వీకారం గురించి చెప్పగానే సభా ప్రాంగణం అంతా చప్పట్లతో మారుమోగిపోయింది.

pavanchiru.jpg

అదే సమయంలో పవన్ కళ్యాణ్ అన్నయ్య మెగా స్టార్ చిరంజీవి మోహంలో చిరునవ్వు, ఆనందం, సంతోషం అంతా ఇంతా కాదు. చిరంజీవి ఎంతో ఆప్యాయతతో తన తమ్ముడి ప్రమాణస్వీకారం చేస్తున్నంతసేపు భావోద్వేగంతో చూస్తూ వున్నారు. పవన్ కళ్యాణ్ తన ప్రమాణ స్వీకారం ముగియగానే చంద్రబాబుని, ప్రధాని మోదీని, తరువాత అక్కడకి వచ్చిన ప్రత్యేక అతిధులకు నమస్కారవం చేసుకుంటూ వెళ్లారు.

konidelaana.jpg

అన్నయ్య చిరంజీవి దగ్గరికి రాగానే ఒక్కసారిగా వంగి పాదాభివందనం చేసుకున్నారు. చిరంజీవి కూడా అంతే ఆప్యాయతతో తమ్ముడిని అక్కున చేర్చుకున్నారు. ఈ దృశ్యం చూసి సభా ప్రాంగణం అంతా ఒక్కసారిగా హోరెత్తింది.

Updated Date - Jun 12 , 2024 | 12:24 PM