ఆ భయంతోనే మీడియా ముందుకు రాలేదు
ABN , Publish Date - Oct 19 , 2024 | 06:30 AM
‘తోటి మహిళా కొరియోగ్రాఫర్‌పై జానీమాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడనే విషయం మమ్మల్ని దిగ్ర్భాంతికి గురిచేసింది. ఒక అమ్మాయి జీవితంతో ముడిపడి
‘తోటి మహిళా కొరియోగ్రాఫర్‌పై జానీమాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడనే విషయం మమ్మల్ని దిగ్ర్భాంతికి గురిచేసింది. ఒక అమ్మాయి జీవితంతో ముడిపడి ఉన్న విషయం కావడంతో ఏం మాట్లాడితే ఏమవుతుందో అని అందరం భయపడ్డాం. అందుకే డ్యాన్సర్స్ అసోసియేషన్, కొరియోగ్రాఫర్లు ఇప్పటివరకూ మీడియా ముందుకు రాలేదు’ అని టాలీవుడ్ మహిళా కొరియోగ్రాఫర్ అనీ అన్నారు. జానీ మాస్టర్, బాధితురాలి మధ్య ఏం జరిగిందనేది మనకెవరికీ తెలియదు. ఒకవేళ ఆమె ఆరోపణలు నిజమైతే ఆయన్ని కఠినంగా శిక్షించాల్సిందే . కానీ జానీ మాస్టర్ నిరపరాధి అని తేలితే పరిస్థితి ఏమిటి? అలాగే కోర్టు తీర్పు చెప్పేంతవరకూ మనందరం సంయమనం పాటించాలి. జానీ మాస్టర్ దగ్గర నేను మూడేళ్లపాటు అసిస్టెంట్‌గా చేశాను. ఎప్పుడూ ఇబ్బందులు ఎదుర్కోలేదు. బాధితురాలు కొన్నాళ్ల క్రితం వరకూ ‘జానీమాస్టర్ నా దేవుడు’ అని చెప్పింది. కానీ ఇప్పుడు మాట మార్చి ఆరోపణలు చేసింది. ఆమెను జానీ మాస్టర్ భార్య కూడా ఎంతగానో ప్రోత్సహించారు’ అని అన్నారు.