అంతర్యుద్ధాన్ని ఆవిష్కరించేలా...

ABN , Publish Date - Jul 25 , 2024 | 06:16 AM

‘పలాస 1978’, ‘నరకాసుర’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రక్షిత్‌ అట్లూరి నటించిన చిత్రం ‘ఆపరేషన్‌ రావణ్‌’. వెంకట సత్య దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ న్యూ ఏజ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను ధ్యాన్‌ అట్లూరి నిర్మించారు...

‘పలాస 1978’, ‘నరకాసుర’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రక్షిత్‌ అట్లూరి నటించిన చిత్రం ‘ఆపరేషన్‌ రావణ్‌’. వెంకట సత్య దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ న్యూ ఏజ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను ధ్యాన్‌ అట్లూరి నిర్మించారు. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా రక్షిత్‌ అట్లూరి మీడియాతో ముచ్చటించారు.

‘‘ఇది కొత్తతరానికి బాగా చేరువయ్యే థ్రిల్లర్‌. నాన్న వెంకట సత్యకు దర్శకుడిగా ఇది తొలి సినిమా అయినా ఎక్కడా తడబడలేదు. ఈ సినిమా ప్రతీ మనిషిలో జరిగే ఆలోచనల అంతర్యుద్ధాన్ని కొత్తగా ఆవిష్కరిస్తుంది. ఇందులో నేను ఆనంద్‌ శ్రీరామ్‌ అనే టీవీ రిపోర్టర్‌ పాత్రలో కనిపిస్తాను. యాక్షన్‌ ప్రధానంగా సాగే ఈ సినిమాలో ఓ విభిన్నమైన ప్రేమ కథ కూడా ఉంటుంది. ఈ సినిమా ఒక మనిషి ఎలా సైకోగా మారతాడో విజువల్‌గా చూపిస్తుంది. థియేటర్లలో సినిమా చూసే ప్రేక్షకులు తమ టికెట్‌కు వంద శాతం న్యాయం జరిగిందని భావిస్తారు’’ అని చెప్పారు.

Updated Date - Jul 25 , 2024 | 06:16 AM