కుతంత్రమే ఆమె మంత్రం
ABN , Publish Date - Sep 24 , 2024 | 02:34 AM
విష్ణు మంచు హీరోగా డాక్టర్ మోహన్‌బాబు నిర్మిస్తున్న ‘కన్నప్ప’ చిత్రం నుంచి నటి ఐశ్వర్య పోషిస్తున్న మారెమ్మ పాత్రకు సంబంధించిన లుక్‌ను సోమవారం విడుదల చేశారు..
విష్ణు మంచు హీరోగా డాక్టర్ మోహన్‌బాబు నిర్మిస్తున్న ‘కన్నప్ప’ చిత్రం నుంచి నటి ఐశ్వర్య పోషిస్తున్న మారెమ్మ పాత్రకు సంబంధించిన లుక్‌ను సోమవారం విడుదల చేశారు. అందరినీ భయపెట్టే విధంగా ఈ లుక్ ఉంది. ‘అడవిని పీడించే అరాచకం.. మారెమ్మ, కుతంత్రమే ఆమె మంత్రం’ అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంది. డిసెంబర్‌లో విడుదలయ్యే ఈ పాన్ ఇండియా మూవీకి ముఖేశ్‌కుమార్ సింగ్ దర్శకుడు.