కలి స్ఫూర్తిగా
ABN , Publish Date - Oct 01 , 2024 | 03:59 AM
జీవితంలో ఎదురయ్యే సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదు అనే అంశాన్ని ‘కలి’ చిత్రంలో చూపించబోతున్నాం. కలి పురుషుడి పాత్రను స్ఫూర్తిగా...
జీవితంలో ఎదురయ్యే సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదు అనే అంశాన్ని ‘కలి’ చిత్రంలో చూపించబోతున్నాం. కలి పురుషుడి పాత్రను స్ఫూర్తిగా తీసుకొని ఈ చిత్రం తెరకెక్కించాను’ అని దర్శకుడు శివశేషు అన్నారు. ప్రిన్స్, నరేశ్ అగస్త్య హీరోలుగా నటించిన ఈ చిత్రం ఈ నెల 4న విడుదలవుతోంది. ఈ సందర్భంగా శివశేషు సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ‘సమయాన్ని, ఆత్మను ఆధారంగా చేసుకొని కలి ఈ యుగాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాడు అనేది ఆసక్తికరంగా చూపించాం. ఇందులో మంచి ప్రేమకథ కూడా ఉంది. వీఎఫ్‌ఎక్స్ మా సినిమాకు ప్రత్యేకార్షణ’ అని చెప్పారు.