అమాయకత్వం..తింగరితనం...
ABN , Publish Date - Aug 20 , 2024 | 02:33 AM
బాలనటిగా వెండితెరపై అడుగుపెట్టి.. పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు రమ్య పసుపులేటి. ఆమె కథానాయికగా నటించిన చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’...
బాలనటిగా వెండితెరపై అడుగుపెట్టి.. పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు రమ్య పసుపులేటి. ఆమె కథానాయికగా నటించిన చిత్రం ‘మారుతినగర్ సుబ్రమణ్యం’. రావు రమేశ్, అంకిత్ కొయ్య, ఇంద్రజ నటించిన ఈ చిత్రాన్ని లక్ష్మణ్ కార్య తెరకెక్కించారు. ఈ నెల 23న సినిమా విడుదలవుతున్న సందర్భంగా రమ్య మీడయాతో ముచ్చటించారు.
‘‘ఈ సినిమాలో నా పాత్ర చాలా బాగుంటుంది. అమాయకత్వం, తింగరితనం కలగలిపిన పాత్ర నాది. నా పాత్ర ద్వారా అందరూ హాయిగా నవ్వుకుంటారు. దర్శకుడు లక్ష్మణ్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. అంకిత్ కొయ్య కలసి నటించడం మరిచిపోలేని అనుభూతి. సెట్స్‌లో రావు రమేశ్, ఇంద్రజ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ సినిమా తప్పకుండా అందర్నీ మెప్పిస్తుంది’’ అని చెప్పారు.