రవిశంకర్ బయోపిక్‌లో...
ABN , Publish Date - Oct 28 , 2024 | 12:17 AM
ఆధ్యాత్మిక వేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ బయోపిక్ తెరకెక్కనుందని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ చిత్రంలో రవిశంకర్ పాత్రను విక్రాంత్ మాసే పోషించనున్నారని టాక్...
ఆధ్యాత్మిక వేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ బయోపిక్ తెరకెక్కనుందని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ చిత్రంలో రవిశంకర్ పాత్రను విక్రాంత్ మాసే పోషించనున్నారని టాక్. గతేడాది సిద్ధార్థ్ ఆనంద్, మహావీర్ జైన్ ఈ చిత్రాన్ని ప్రకటించారు. హిందీతో పాటు ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. కొన్ని రోజుల క్రితం విక్రాంత్‌మాసే రవిశంకర్‌ను కలసి ఆశీస్సులు అందుకున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ చిత్రంపై అధికారిక ప్రకటన రావొచ్చని భావిస్తున్నారు.