టెర్రిఫిక్ రోల్‌లో
ABN , Publish Date - Nov 09 , 2024 | 06:28 AM
క్రిష్ దర్శకత్వంలో అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘ఘాటీ’. రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మాతలు. అనుష్క ఫెరోషియస్ అవతార్‌ని పరిచయం చేస్తూ
క్రిష్ దర్శకత్వంలో అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘ఘాటీ’. రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మాతలు. అనుష్క ఫెరోషియస్ అవతార్‌ని పరిచయం చేస్తూ మేకర్స్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఆదివాసి ప్రజలు తమ వస్తువులన్నింటినీ తీసుకుని కొండపైకి నడుస్తున్నప్పుడు గ్లింప్స్ మొదలవుతుంది. కార్లలో కొంత మంది వ్యక్తులు ఘాట్ రోడ్లపైకి వస్తారు. తన శరీరం అంతటా ట్రైబల్ టాటూ్‌సతో, బస్ వైపు కొడవలితో నడుచుకుంటూ వచ్చిన అనుష్క స్టన్నింగ్ ఎంట్రీ ఆసక్తిని రేపుతోంది. అనుష్క బస్సులోకి ఎంటరై ఒక వ్యక్తి మెడను నరికి అద్దంలో తనను తాను చూసుకోవడం టెర్రిఫిక్‌గా ఉంది. అతని మెడని నరికిన తర్వాత రక్తం చిందే తలని పట్టుకొని నడుస్తూ, పొగ తాగుతున్నట్లు కనిపించిన విజువల్స్ అదిరిపోయాయి. ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.