IFII : ముగిసిన ఇఫీ చిత్రోత్సవం

ABN , Publish Date - Nov 30 , 2024 | 05:08 AM

ఈ నెల 20 నుంచి 28 వరకూ తొమ్మిది రోజుల పాటు సినీ ప్రేమికులను అలరించిన 55వ భారత అంతర్జాతీయ చిత్రోత్సవం (ఇఫీ) ముగిసింది. గురువారం గోవాలో

  • ఆస్ట్రేలియా దర్శకుడు ఫిలిప్‌ నోయి్‌సకు సత్యజిత్‌ రే జీవిత సాఫల్య పురస్కారం

  • ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ 2024 - విక్రాంత్‌ మాస్సే

  • ‘టాక్సిక్‌’ చిత్రానికి ‘ది గోల్డెన్‌ పీకాక్‌’ పురస్కారం

ఈ నెల 20 నుంచి 28 వరకూ తొమ్మిది రోజుల పాటు సినీ ప్రేమికులను అలరించిన 55వ భారత అంతర్జాతీయ చిత్రోత్సవం (ఇఫీ) ముగిసింది. గురువారం గోవాలో నిర్వహించిన ముగింపు వేడుకల్లో ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ విజేతలకు పురస్కారాలను ప్రదానం చేశారు. ప్రతిష్ఠాత్మక సత్యజిత్‌ రే జీవిత సాఫల్య పురస్కారం ఆస్ట్రేలియా దర్శకుడు ఫిలిప్‌ నోయి్‌సకు దక్కింది. ఉత్తమ చిత్రం విభాగంలో లిఽథువేనియన్‌ చిత్రం ‘టాక్సిక్‌’ ‘ది గోల్డెన్‌ పీకాక్‌’ పురస్కారాన్ని గెలుచుకుంది. ఈ చిత్రానికి గాను ఉత్తమ నటీమణులుగా వెస్ట, లెవాలు సంయుక్తంగా పురస్కారం అందుకున్నారు. ‘ద న్యూ ఇయర్‌ దట్‌ నెవర్‌ కేమ్‌’ చిత్రానికి గాను రొమేనియాకు చెందిన బోగ్దాన్‌ మురేసాకు ఉత్తమ దర్శకుడి పురస్కారం దక్కింది. ఫ్రెంచ్‌ చిత్రం ‘హోలీ కౌ’లో నటించిన కెమెంట్‌ ఫావు ఉత్తమ నటుడి పురస్కారం స్వీకరించారు. స్వీడిష్‌ చిత్రం ‘క్రాసింగ్‌’ దర్శకుడు లెవన్‌ అఖిన్‌ ఐసీఎ్‌ఫటీ - యునెస్కో గాంధీ మెడల్‌ - 2024 పురస్కారాన్ని అందుకున్నారు.

ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ 2024 పురస్కారం బాలీవుడ్‌ నటుడు విక్రాంత్‌ మాస్సేకు దక్కింది. ఇండియన్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో గుజరాతీ చిత్రం ‘ఘరత్‌ గణపతి’కి గాను నవజ్యోత్‌ బండివాడేకర్‌ ఉత్తమ అరంగేట్ర దర్శకుడిగా పురస్కారాన్ని దక్కించుకున్నారు.

మరాఠీ వెబ్‌సిరీస్‌ ‘లంపన్‌’ ఉత్తమ వెబ్‌సిరీ్‌సగా నిలిచింది. ఈ చిత్రోత్సవాల్లో 80 దేశాలకు చెందిన 180 సినిమాలను ప్రదర్శించారు. ఇఫీ ముగింపు వేడుకల్లో దేశ విదేశాలకు చెందిన సినీ ప్రముఖులు సందడి చేశారు. రష్మిక మందన్న, శ్రియా శరణ్‌, ప్రతీక్‌గాంధీ, మధుర్‌ భండార్కర్‌, హరీశ్‌ శంకర్‌, నివేదాథామస్‌, నిర్మాత దిల్‌రాజు సహా పలువురు సినీ ప్రముఖులు ముగింపు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ చిత్రోత్సవంలో అక్కినేని నాగేశ్వరరావు, రాజ్‌కపూర్‌, గాయకుడు మహమ్మద్‌ రఫీ, దర్శకుడు తపన్‌సిన్హాల శతాబ్ది వేడుకలు నిర్వహించారు.

Updated Date - Nov 30 , 2024 | 05:08 AM