ఆ సన్నివేశాలు తొలగిస్తే ఓకే
ABN , Publish Date - Sep 27 , 2024 | 02:18 AM
తాము సూచించిన సన్నివేశాలకు కత్తెర వేస్తే ‘ఎమర్జెన్సీ’ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తామని సెన్సార్ బోర్డు బాంబే హైకోర్టుకు తెలిపింది. కంగనా రనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో...
హైకోర్టుకు తెలిపిన సెన్సార్ బోర్డు
తాము సూచించిన సన్నివేశాలకు కత్తెర వేస్తే ‘ఎమర్జెన్సీ’ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తామని సెన్సార్ బోర్డు బాంబే హైకోర్టుకు తెలిపింది. కంగనా రనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడంతో పలుమార్లు విడుదల వాయిదా పడింది. దీంతో ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించగా, సర్టిఫికెట్ జారీ చేసే విషయంలో ఈ నెల 25లోగా ఓ నిర్ణయం తీసుకోవాలని సెన్సార్ బోర్డ్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు గురువారం విచారణకు రాగా, కొన్ని సన్నివేశాల్లో కట్స్‌ను సూచించిన సెన్సార్‌బోర్డ్ అందుకు అంగీకరిస్తే సెన్సార్ సర్టిఫికెట్ ఇస్తామని కోర్టుకు నివేదించింది. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి చిత్రబృందం సమయం కోరింది. దీంతో కోర్టు తదుపరి విచారణను ఈ నెల 30కు వాయిదా వేసింది. ఆ లోగా ఓ నిర్ణయానికి రావాలని నిర్మాణసంస్థను ఆదేశించింది.
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితం, ఎమర్జెన్సీ నాటి సంఘటనల నేపథ్యంలో ‘ఎమర్జెన్సీ’ తెరకెక్కింది. కంగన ఇందిరాగాంధీ పాత్రను పోషించడంతో పాటు స్వీయ దర్శకత్వంలో నిర్మించారు.