ఏం అడగాలనుకుంటున్నారో నాకు తెలుసు

ABN , Publish Date - Nov 24 , 2024 | 01:10 AM

సంగీత దర్శకుడు ఏ. ఆర్‌ రెహమాన్‌, ఆయన బృంద సభ్యురాలు మోహినీ దే ఇద్దరూ ఒకేసారి జీవిత భాగస్వాముల నుంచి విడిపోతున్నట్లు ప్రకటించడం, వారిద్దరి మధ్య...

సంగీత దర్శకుడు ఏ. ఆర్‌ రెహమాన్‌, ఆయన బృంద సభ్యురాలు మోహినీ దే ఇద్దరూ ఒకేసారి జీవిత భాగస్వాముల నుంచి విడిపోతున్నట్లు ప్రకటించడం, వారిద్దరి మధ్య ఏదో నడుస్తున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం అవడం తెలిసిందే. ఇప్పటికే రెహమాన్‌ భార్య సైరాబాను లాయర్‌ వందన షా ఈ ప్రచారాన్ని ఖండించగా తాజాగా మోహినీ దే కూడా స్పందించారు.

‘‘నా విడాకుల ప్రకటన తర్వాత ఇంటర్వ్యూ కోసం చాలా మంది నుంచి వరుసగా ఫోన్‌ కాల్స్‌, మెసేజెస్‌ వస్తున్నాయి. అందరూ నన్ను ఇంటర్వ్యూలో ఏం అడగాలనుకుంటున్నారో నాకు తెలుసు. నేను వారి అభ్యర్థనను సున్నితంగా తిరస్కరిస్తున్నాను. నాకున్న శక్తిని.. సమయాన్ని వదంతుల కోసం కేటాయించలేను. నా వ్యక్తిగత గోప్యతను అందరూ గౌరవిస్తారని ఆశిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.


పరువు నష్టం దావా వేస్తాం

తన వ్యక్తిగత జీవితం గురించి తప్పుడు వార్తలను వ్యాప్తిచేస్తున్న వారిపై ఏఆర్‌ రె హమాన్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి దుష్ప్రచారం ఆపకపోతే పరువునష్టం దావా వేస్తామని ఆయన తరపు న్యాయవాది నర్మదా సంపత్‌ హెచ్చరించారు. ‘‘సోషల్‌ మీడియాలో కొందరు రెహమాన్‌ దంపతుల వ్యక్తిగత జీవితాలపై కల్పిత కథనాలను ప్రసారం చేస్తున్నారు. వారి విడాకుల అంశంపై పరిశ్రమలోని ఇతర వ్యక్తుల నుంచి అభిప్రాయాలను సేకరించి ఆ వీడియోలను పోస్ట్‌ చేస్తున్నారు. ఇదంతా అనవసరం’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. సోషల్‌ మీడియాలో ప్రసారమవుతున్న కంటెంట్‌లో ఏమాత్రం నిజం లేదని, రెహమాన్‌ పేరు ప్రతిష్ఠలకు, గౌరవానికి భంగం కలిగించేందుకే ఈ తరహా చీప్‌ పబ్లిసిటీ చేస్తున్నారని అన్నారు. వాటిని తొలగించేందుకు 24 గంటల సమయం ఇస్తున్నామని స్పష్టం చేశారు. గడువులోగా తొలగించకపోతే చట్టరీత్యా చర్యలు తీసుకోవడంతో పాటు పరువునష్టం దావా కూడా వేస్తామని పేర్కొన్నారు.

Updated Date - Nov 24 , 2024 | 01:10 AM