I Hate Love: ‘ఐ హేట్ లవ్’ విడుదల ఎప్పుడంటే..

ABN , Publish Date - Feb 09 , 2024 | 02:29 PM

సుబ్బు, శ్రీవల్లి, కిట్టయ్య ప్రధాన పాత్రలలో నటిస్తోన్న చిత్రం ‘ఐ హేట్ లవ్’. ‘నేనూ ప్రేమలో పడ్డాను’ అనేది ఉపశీర్షిక. వెంకటేష్. వి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని డాక్టర్ బాల రావి నిర్మించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను ‘గుడుంబా శంకర్’ చిత్ర దర్శకుడు వీరశంకర్ చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. ఇదే కార్యక్రమంలో చిత్ర విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఫిబ్రవరి 16న ఈ చిత్రం థియేటర్లో విడుదల కానుంది.

I Hate Love: ‘ఐ హేట్ లవ్’ విడుదల ఎప్పుడంటే..
I Hate Love Movie Trailer Launch Event

సుబ్బు, శ్రీవల్లి, కిట్టయ్య ప్రధాన పాత్రలలో నటిస్తోన్న చిత్రం ‘ఐ హేట్ లవ్’. ‘నేనూ ప్రేమలో పడ్డాను’ అనేది ఉపశీర్షిక. వెంకటేష్. వి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని డాక్టర్ బాల రావి నిర్మించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను ‘గుడుంబా శంకర్’ చిత్ర దర్శకుడు వీరశంకర్ చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. ఇదే కార్యక్రమంలో చిత్ర విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఫిబ్రవరి 16న ఈ చిత్రం థియేటర్లో విడుదల కానుంది.

ట్రైలర్ విడుదల చేసిన అనంతరం డైరెక్టర్ వీర శంకర్ మాట్లాడుతూ.. ట్రైలర్ చాలా బాగుంది. సహజత్వంగా చాలా బాగా చిత్రీకరించారని, అన్నివర్గాల వారికి ఈ చిత్రం నచ్చుతుందని అన్నారు. ప్రేక్షకులు మంచి చిత్రాలను ఎప్పుడూ ఆదరిస్తారు. ఫిబ్రవరి 16న వస్తున్న ఈ సినిమాని కూడా ప్రేక్షకులు మంచి సక్సెస్ చేస్తారని కోరుతూ.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. నిర్మాత డాక్టర్ బాల రావి (USA) మాట్లాడుతూ.. కథ పరంగా ఎక్కడా రాజీపడకుండా అద్భుతంగా తెరకెక్కించాము. గోదావరి ఒడ్డున కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో.. మా సినిమా అంత ప్రశాంతంగా ఆస్వాదించవచ్చని తెలిపారు. (I Hate Love Movie Trailer Launched)


Sri-Valli.jpg

కో- ప్రొడ్యూసర్ పాలగుమ్మి వెంకట కృష్ణ మాట్లాడుతూ మంచి చిత్రాలను ఎప్పుడూ ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ఈ చిత్రం తీశామన్నారు. చిత్ర దర్శకుడు వెంకటేష్. వి మాట్లాడుతూ.. గోదావరి జిల్లా యాసతో పూర్తిగా కోనసీమ పరిసరప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ చేయడం జరిగింది. ఇది యూత్‌ని బాగా ఆకట్టుకునే సందేశాత్మక చిత్రం. పెద్దపల్లి రోహిత్ సంగీతాన్ని అందించారు. పాటలకి మంచి స్పందన వచ్చింది, మా సినిమాని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నానని అన్నారు. అంగర శివ సాయి గౌడ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఏస్‌కె‌యల్‌ఎమ్ మోషన్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదలకానుంది. (I Hate Love Movie Release Date)


ఇవి కూడా చదవండి:

====================

*Karthik Gattamneni: తెలుగులో ‘ఈగల్’.. హిందీలో ‘సహదేవ్’ అని ఎందుకు పెట్టామంటే..

*************************

*Director Maruthi: ‘ట్రూ లవర్’ జంటతో డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తాం

**************************

*ప్రకటనలతో సరిపెట్టొద్దు.. ప్రజాక్షేత్రంలోకి వెళ్లండి: విజయ్‌కి ఈ సూచన ఎవరిచ్చారో తెలుసా..?

****************************

Updated Date - Feb 09 , 2024 | 02:29 PM