ఎంతో సంతోషంగా ఉంది

ABN , Publish Date - Nov 29 , 2024 | 06:14 AM

అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి మొదలైన సంగతి తెలిసిందే. నాగచైతన్య, శోభిత పెళ్లి డిసెంబరు 4న జరగనుండగా.. అఖిల్‌కు ఇటీవలే తన ప్రేయసి జైనబ్‌తో నిశ్చితార్థం జరిగింది. తన కుటుంబంలో జరుగుతోన్న...

అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి మొదలైన సంగతి తెలిసిందే. నాగచైతన్య, శోభిత పెళ్లి డిసెంబరు 4న జరగనుండగా.. అఖిల్‌కు ఇటీవలే తన ప్రేయసి జైనబ్‌తో నిశ్చితార్థం జరిగింది. తన కుటుంబంలో జరుగుతోన్న వరుస శుభకార్యాల పట్ల నాగార్జున సంతోషం వ్యక్తం చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘‘ఈ ఏడాది మాకెంతో ప్రత్యేకమైనది. ఓ వైపు నాన్న శతజయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. మరోవైపు మా ఇద్దరబ్బాయిలు కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. నాగచైతన్య, శోభిత పెళ్లికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఏఎన్నార్‌ స్థాపించిన అన్నపూర్ణ స్టూడియో్‌సలో ఈ పెళ్లి జరగబోతున్నందుకు, అఖిల్‌ కూడా వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉంది. జైనబ్‌ చాలా మంచి అమ్మాయి. ఇతరులపై ఎంతో ప్రేమ, అభిమానం చూపిస్తారు. వారిద్దరూ కలిసి జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నందుకు సంతోషంగా ఉంది. అఖిల్‌ జీవితాన్ని ఆమె పరిపూర్ణం చేయగలరు. ఆమెను సంతోషంగా మా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాం. వచ్చే ఏడాదిలో వీరి పెళ్లి జరగనుంది’’ అని నాగార్జున తెలిపారు.

Updated Date - Nov 29 , 2024 | 06:14 AM