రాణీగా గర్వపడుతున్నాను
ABN , Publish Date - Jul 31 , 2024 | 01:22 AM
విభిన్నమైన పాత్రలతో కథానాయికగా తనదైన పంథాలో కొనసాగుతున్నారు తాప్సీ. ‘ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా’ చిత్రంతో ఆమె ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు...
విభిన్నమైన పాత్రలతో కథానాయికగా తనదైన పంథాలో కొనసాగుతున్నారు తాప్సీ. ‘ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా’ చిత్రంతో ఆమె ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. గతంలో వచ్చిన ‘హసీన్ దిల్రుబా’ చిత్రానికి ఇది కొనసాగింపు. అందులో ఆమె రాణి అనే గృహిణి పాత్రలో కనిపించారు. ఇప్పుడు రెండో భాగంలోనూ అదే పాత్రలో కనిపించనున్నారు. ‘ప్రతి నాయక ఛాయలున్న పాత్ర కావడం వల్ల కొంతమందికి నచ్చలేదు. నాకు బాగా నచ్చింది. ఇలాంటి పాత్రను పోషించినందుకు గర్వపడుతున్నాను’ అని తాప్సీ పేర్కొన్నారు. ఆగస్టు 9న ఈ చిత్రం ఓటీటీలో విడుదలవుతోంది.