అభిమానుల ప్రేమకు ఆనంద భాష్పాలు

ABN , Publish Date - Aug 31 , 2024 | 06:07 AM

అభిమానుల ప్రేమలో తడిసి ముద్దయ్యారు హాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఏంజెలీనా జోలీ. వెనీస్‌ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో ఆమె నటించిన ‘మరియ’ చిత్రం ప్రత్యేక ప్రదర్శనకు హాజరయ్యారు.

అభిమానుల ప్రేమలో తడిసి ముద్దయ్యారు హాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఏంజెలీనా జోలీ. వెనీస్‌ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో ఆమె నటించిన ‘మరియ’ చిత్రం ప్రత్యేక ప్రదర్శనకు హాజరయ్యారు. షో పూర్తవ్వగానే అందరూ లేచి నిలబడి కరతాళ ధ్వనులతో ఆమె నటనను అభినందించారు. దాదాపు ఎనిమిది నిమిషాల పాటు థియేటర్‌ అంతా మార్మోగింది. తనపై అభిమానులు చూపుతున్న ప్రేమతో ఉద్వేగానికి లోనైన ఏంజెలీనా కన్నీళ్లను ఆపలేకపోయారు. సహనటుడు ఫియర్స్‌ ఫావినో ఆమెను సముదాయించారు. అభిమానులకు ఏంజెలీనా ధన్యవాదాలు తెలిపారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవడంతో ఎన్నో కష్టాలు అనుభవించి ఆమె ఈ స్థాయికి చేరుకున్నారు అని అభిమానులు ఏంజెలినాను ప్రశంసిస్తున్నారు.

Updated Date - Aug 31 , 2024 | 06:07 AM