Maa Nanna Super Hero: సుధీర్ బాబు ‘మా నాన్న సూపర్‌హీరో’ విడుదల ఎప్పుడంటే?

ABN , Publish Date - Aug 27 , 2024 | 07:46 PM

నవ దళపతి సుధీర్ బాబు యూనిక్ ఎమోషనల్ సాగా ‘మా నాన్న సూపర్‌హీరో’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ‘లూజర్’ సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వి సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై, CAM ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. తాజాగా ఈ మూవీ విడుదలకు సంబంధించి అప్డేట్‌ని మేకర్స్ వదిలారు.

Hero Sudheer Babu

నవ దళపతి సుధీర్ బాబు (Nava Dalapathy Sudheer Babu) నటిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ ‘మా నాన్న సూపర్‌ హీరో’ (Maa Nanna Super Hero). ‘లూజర్’ సిరీస్ ఫేమ్ అభిలాష్ రెడ్డి కంకర (Abhilash Reddy Kankara) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వి సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై, CAM ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. తాజాగా మేకర్స్ మూవీ విడుదలకు సంబంధించిన అప్‌డేట్‌‌ను వదిలారు. దసరా (Dussehra) పండుగ సందర్భంగా ‘మా నాన్న సూపర్‌ హీరో’ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా ఈ అప్‌డేట్‌లో ప్రకటించారు.

Also Read- Natural Star Nani: సినిమా చూడాలనే థాట్‌ని ట్రిగ్గర్ చేయడం చాలా పెద్ద పని

సినిమాల విడుదలకు బెస్ట్ సీజన్లలో దసరా ఒకటి. ఫ్యామిలీస్‌ని ఎక్కువగా ఎట్రాక్ట్ చేసే కంటెంట్ వున్న ‘మా నాన్న సూపర్ హీరో’ రిలీజ్ కి దసరా పర్ఫెక్ట్ టైమ్. ఎగ్జాక్ట్ రిలీజ్ డేట్‌ని త్వరలోనే రివీల్ చేయనున్నామని మేకర్స్ ఈ సందర్భంగా తెలియజేశారు. ‘మా నాన్న సూపర్‌ హీరో’ మూవీ ప్రేమ, అనుబంధంకు నిజమైన అర్థాన్ని తెలుసుకుంటూ సోల్‌ని కదిలించే జర్నీని ప్రారంభించిన ఫాదర్ అండ్ సన్ డ్రామా. టైటిల్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను మేకర్స్ తెలియజేయనున్నారు. (Maa Nanna Super Hero Movie Update)


Maa-Nanna-Super-Hero.jpg

సుధీర్ బాబు సరసన ఆర్ణ (Aarna) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీలో సాయి చంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, అన్నీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి సమీర్ కళ్యాణి సినిమాటోగ్రాఫర్ కాగా, జై క్రిష్ మ్యూజిక్ డైరెక్టర్. అనిల్ కుమార్ పి ఎడిటర్, ఝాన్సీ గోజాల ప్రొడక్షన్ డిజైనర్. మహేశ్వర్ రెడ్డి గోజాల క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. రాజు సుందరం (Raju Sundaram) మాస్టర్‌ కొరియోగ్రఫీతో పాటు ఓ కీలక పాత్రను ఇందులో పోషిస్తుండటం విశేషం.

Read Latest Cinema News

Updated Date - Aug 27 , 2024 | 07:46 PM