Happy Ending: చిన్న సినిమా కాదు మంచి సినిమా..

ABN , Publish Date - Jan 20 , 2024 | 05:13 PM

యష్ పూరి హీరోగా నటించిన కొత్త సినిమా ‘హ్యాపీ ఎండింగ్’. అపూర్వ రావ్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని హమ్స్ టెక్ ఫిలింస్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. యోగేష్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల నిర్మాతలు. కౌశిక్ భీమిడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 2న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. శనివారం ఈ చిత్ర ట్రైలర్‌ను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వేణు ఊడుగుల చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.

Happy Ending: చిన్న సినిమా కాదు మంచి సినిమా..
Happy Ending Trailer Launch Event

యష్ పూరి హీరోగా నటించిన కొత్త సినిమా ‘హ్యాపీ ఎండింగ్’. అపూర్వ రావ్ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని హమ్స్ టెక్ ఫిలింస్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. యోగేష్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల నిర్మాతలు. కౌశిక్ భీమిడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 2న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. శనివారం ఈ చిత్ర ట్రైలర్‌ను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వేణు ఊడుగుల చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు.

ట్రైలర్ విడుదల అనంతరం దర్శకుడు వేణు ఊడుగుల మాట్లాడుతూ.. ‘‘హ్యాపీ ఎండింగ్ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఇదొక న్యూ ఏజ్ మూవీ అనిపిస్తోంది. క్లాసిక్ అప్రోచ్‌తో తెరకెక్కించారు. హీరో హీరోయిన్లు ఇద్దరు బాగా నటించారు. పాటలు బాగున్నాయి. దర్శకుడు కౌశిక్‌కు ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. రైటర్ నాగసాయి నాకు బాగా పరిచయం. నాతో వర్క్ చేస్తున్నాడు. బాలీవుడ్‌లో ‘వికీ డోనర్’లా తెలుగులో ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా’’నని తెలిపారు. (Happy Ending Trailer Launch)

Yash-Puri.jpg

హీరో యష్ పూరి (Yash Puri) మాట్లాడుతూ.. హీరోగా నేను చేస్తున్న రెండో సినిమా ఇది. నా ఫస్ట్ మూవీ నుంచి ఫ్రెండ్స్, ఫ్యామిలీ, మా హమ్స్ టెక్ స్టూడెంట్స్, మీడియా మిత్రులు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఈ ట్రైలర్ చూస్తే కాస్త అడల్ట్ కంటెంట్ ఉన్నట్లు అనిపించవచ్చు. కానీ సెన్సార్ అయ్యాక మాకు యు సర్టిఫికెట్ వస్తుందని ఆశిస్తున్నాను. అన్ని వర్గాల ప్రేక్షకులు నిరభ్యంతరంగా మా సినిమా చూడొచ్చు. ఈ సినిమాలో హర్ష్‌కు కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి. నేను అలాంటివి నమ్మను. మాది చిన్న సినిమా కాదు మంచి సినిమా. మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరూ మంచి అవుట్‌పుట్ ఇచ్చారని అన్నారు. ‘సినిమా మీద ప్యాషన్ ఉన్న వాళ్లంతా టైమ్, హార్డ్ వర్క్ ఇన్వెస్ట్ చేసి ఈ మూవీని చేశాం. నాకు మైథాలజీ ఇష్టం. మహాభారతం చదువుతున్నప్పుడు అందులో అనేక శాపాల గురించి ఉంటుంది. అలా ఒక శాపం హీరోకు ఉంటే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో మోడ్రన్ అప్రోచ్ తో చేసిన సినిమా ఇది’ అని అన్నారు దర్శకుడు కౌశిక్ భీమిడి. ఇంకా చిత్ర నిర్మాత, హీరోయిన్ ఈ కార్యక్రమంలో ప్రసంగించారు.

ఇవి కూడా చదవండి:

====================

*Mohan Babu: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం వచ్చింది కానీ..?

****************************

*Varun Tej: మెగా ప్రిన్స్ బర్త్‌డే స్పెషల్‌గా వదిలిన ‘మట్కా’ ఓపెనింగ్ బ్రాకెట్.. ఎలా ఉందంటే?

**************************

*Hansika: 34 నిమిషాల షాట్‌ని సింగిల్ టేక్‌లో..

***************************

*Nayanthara: జై శ్రీరామ్ అంటూ.. క్షమాపణలు చెప్పిన నయనతార

****************************

Updated Date - Jan 20 , 2024 | 05:19 PM