Teja Sajja: చిరంజీవిపై ప్రేమ‌.. ఆ వేదిక‌పై హ‌నుమాన్ ‘తేజ’ డ్యాన్స్ పెర్ఫామెన్స్

ABN , Publish Date - Mar 20 , 2024 | 08:44 PM

త్వ‌ర‌లో హైదరాబాద్‌లో జరగనున్న సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ తొలి వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవిహాజరు కాబోతున్న సంగతి తెలిసిందే. దీంతో మెగాభిమానులు, సినీ ప్రేమికులు, ప్రేక్షకులు ఈ ఉత్సవం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Teja Sajja: చిరంజీవిపై ప్రేమ‌.. ఆ వేదిక‌పై హ‌నుమాన్ ‘తేజ’ డ్యాన్స్ పెర్ఫామెన్స్
teja

త్వ‌ర‌లో హైదరాబాద్‌లో జరగనున్న సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ (SouthIndian Film Festival) తొలి వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హాజరు కాబోతున్న సంగతి తెలిసిందే. దీంతో మెగాభిమానులు, సినీ ప్రేమికులు, ప్రేక్షకులు ఈ ఉత్సవం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

sajja.jpeg

ఈ నేపథ్యంలో చిరంజీవి (Chiranjeevi)పై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ యంగ్ హీరో హ‌నుమాన్‌ తేజ సజ్జా (Teja Sajja) ఓ స్పెష‌ల్‌ డాన్స్ పెర్ఫామెన్స్‌ చేయనుండటం ప్ర‌త్యేక‌త‌ల‌ను సంత‌రించుకుంది. ఈ వేడుక‌ మార్చి 22 శుక్ర‌వారం రోజున నోవాటెల్ హోటల్‌లో జరగనుంది.


తేజ సజ్జా (Teja Sajja) .. నటుడిగా విలక్షణమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకుంటున్నాడు. ఈ క్ర‌మంలో చిరంజీవి(Chiranjeevi)పై త‌న బాల్యం నుంచి ఉన్న‌ ప్రేమాభిమానాలను వ్యక్తం చేస్తూ చేస్తూ అంకితమివ‌నున్నారు. చిరంజీవి (Chiranjeevi) సినీ ఇండస్ట్రీపై చూపిన ప్రభావం, కలిగించిన స్ఫూర్తిని తెలియజేసేలా ఈ డాన్స్ పెర్ఫామెన్స్ ఉండ‌నుంది.

Updated Date - Mar 20 , 2024 | 08:44 PM