సగం వాటా అమ్మేశారు

ABN , Publish Date - Oct 22 , 2024 | 02:17 AM

బాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌, హోస్ట్‌ కరణ్‌ జోహార్‌ తన నిర్మాణ సంస్థ ‘ధర్మ ప్రొడక్షన్స్‌’లో సగ భాగం వాటా అమ్మేశాడు. కొన్ని రోజులుగా కరణ్‌ జోహార్‌ ‘ధర్మ ప్రొడక్షన్స్‌’ని అమ్మకానికి పెట్టినట్లు వార్తలొచ్చాయి. తాజాగా ఆ వార్తలు....

బాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌, హోస్ట్‌ కరణ్‌ జోహార్‌ తన నిర్మాణ సంస్థ ‘ధర్మ ప్రొడక్షన్స్‌’లో సగ భాగం వాటా అమ్మేశాడు. కొన్ని రోజులుగా కరణ్‌ జోహార్‌ ‘ధర్మ ప్రొడక్షన్స్‌’ని అమ్మకానికి పెట్టినట్లు వార్తలొచ్చాయి. తాజాగా ఆ వార్తలు నిజమయ్యాయి. కరణ్‌కు చెందిన ‘ధర్మ’లోని 50 శాతం వాటాని ప్రముఖ టీకాల తయారీ సంస్థ అధినేత అదర్‌ పూనావాలా రూ.1000 కోట్లకు దక్కించుకున్నాడు. మరో 50 శాతం వాటా కరణ్‌ పేరు మీదే ఉండనుంది. ఈ డీల్‌ తరవాత ధర్మ ప్రొడక్షన్స్‌ విలువ ఏకంగా రూ. రెండు వేల కోట్లకు పెరుగుతుందని సెరీన్‌ ప్రొడక్షన్స్‌ పేర్కొంది. దర్మ ప్రొడక్షన్స్‌ కొంత కాలంగా భారీ నష్టాలను చవిచూస్తోంది. అలియా భట్‌తో నిర్మించిన ఇటీవలి చిత్రం జిగ్రా నష్టాల కారణంగా ధర్మ సంస్థ ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో కొట్టుమిట్టాడుతోంది. జిగ్రా ఇప్పటి వరకు టోటల్‌ కలెక్షన్‌ రూ.21 కోట్లు మాత్రమే వసూలు చేసింది.


బాలీవుడ్‌ మీడియా కథనాల ప్రకారం.. రూ.80 కోట్ల బడ్జెట్‌తో జిగ్రా నిర్మించారు. పబ్లిసిటీకి మరో రూ.10 కోట్లు కేటాయించారు. కాగా, ‘ధర్మ ప్రొడక్షన్స్‌’కి ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా కరణ్‌ ఉండగా, ఆయన స్నేహితుడు అపూర్వ మెహతా సీఈవోగా కొనసాగుతున్నాడు.

Updated Date - Oct 22 , 2024 | 02:17 AM