ముందస్తు బెయిల్ ఇవ్వండి
ABN , Publish Date - Nov 12 , 2024 | 06:25 AM
తెలుగు ప్రజలను కించపరిచేలా ఇటీవల వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటి కస్తూరి.. తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేశారు. తెలుగువారిపై చేసిన వ్యాఖ్యల పట్ల...
నటి కస్తూరి హైకోర్టులో పిటిషన్
తెలుగు ప్రజలను కించపరిచేలా ఇటీవల వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటి కస్తూరి.. తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేశారు. తెలుగువారిపై చేసిన వ్యాఖ్యల పట్ల విచారణ వ్యక్తం చేసిన తర్వాత కూడా రాజకీయకక్ష కారణంగా తనపై కేసు నమోదుచేశారని పిటిషన్లో ఆరోపించారు. ఈ కేసులో కోర్టు విధించిన అన్ని షరతులకు కట్టుబడి ఉంటానని, అందువల్ల తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్‌పై విచారణ న్యాయమూర్తి ఆనంద్ వెంకటేశ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు మంగళవారం రానుంది. కస్తూరిపై మదురై, సేలం, చెన్నై తదితర ప్రాంతాల్లో పలు ఫిర్యాదులు నమోదైన విషయం తెలిసిందే.
చెన్నై (ఆంధ్రజ్యోతి)